NARESH-PAVITHRA: మమ్మల్ని విమర్శించినా వాళ్ళ అందరికి సమాధానం ‘మళ్ళి పెళ్లి’ సినిమా !

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సీనియర్ యాక్టర్ నరేష్ ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తున్నారు అటు సినిమా ల లో నటిస్తూనే మరో పక్క నటి పవిత్ర లోకేష్ తో ఎఫ్ఫైర్ ,తన మాజీ భార్య తో గొడవ ల నేపథ్యం లో నిరంతరం వార్తల లో నిలిచే వారు.అయితే తన మాజీ భార్య నుంచి విడాకులు తీసుకుని పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్న నరేష్ ,పవిత్ర ప్రధాన పాత్రా ల లో ‘మళ్ళి పెళ్లి’ సినిమా లో నటించారు.దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియా వైరల్ గా మారింది.

సీనియర్ నిర్మాత అయినా ఏం ఎస్ రాజు డైరెక్షన్ లో నరేష్ ప్రొడ్యూసర్ గా వస్తున్న మళ్ళి పెళ్లి సినిమా ని నరేష్ జీవితం లో జరిగిన ఒరిజినల్ సీన్ ల ను పెట్టాము అని ,తన మీద నెగటివ్ గా పబ్లిసిటీ చేసిన తన మాజీ భార్య ,కొన్ని మీడియా ఛానెళ్ల ని ఈ సినిమా లో ఏకిపారేశాం ని అన్నారు నరేష్.సినిమా ల లో బిజీ గా తనని తన భార్య ఏ విధంగా రోడ్ మీద లాగింది ఆ టైం లో పవిత్ర తనకి సపోర్ట్ గా నిలిచినా విధానం ని క్లియర్ గా చూపించే ప్రయత్నం చేసాము.

మొదట ఇద్దరం కలుస్తున్నం అంటూ ఒక రొమాంటిక్ వీడియో ని రిలీజ్ చేసిన నరేష్ ,పవిత్ర తర్వాత తాము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నం అని ప్రకటించారు.మరల ఇదే సమయం లో ఇది అంతా తాము నటిస్తున్న ‘మళ్ళి పెళ్లి ‘ అనే సినిమా లో ని సీన్ అని అది తమ నిజ జీవితాల కి సంబంధించిన కథ అని అసలు జరిగిన నిజాలు ఏంటో అందరికి చెప్పబోతున్నం అని అన్నారు.ఇప్పటికే మూడు పెళ్లి లు చేసుకుని వారితో విడిపోయిన నరేష్ ఇప్పుడు పవిత్ర తో పెళ్లి ఆమెతో ఎలా ఉంటారు అనేది చర్చనీయాంశం అయింది.

652 views