Thota Narasimham: కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ మంత్రి తోట నరసింహం

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మాజీ మంత్రి తోట నరసింహం(Thota narasimham) తన కుమారుడు తోట శ్రీరాంజీ వివాహ వేడుకకు హాజరు అయ్యి వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan reddy) ని కోరారు తాడేపల్లిలోని వారి నివాసంలో కలుసుకొని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. తోట నరసింహం ఆరోగ్యం పట్ల సంతృప్తి చెందిన జగన్ త్వరలోనే కలసి పనిచేయాలి అని సూచించారు. తోట నరసింహం లాంటి నాయకుడు తిరిగి మళ్ళి ప్రజల మధ్యకు రావటం చాల సంతోషమైన విష్యమని జగన్ తెలిపారు తోట నరసింహం తో కొద్దిసేపు ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు.

ఇక పూర్తి ఆరోగ్యం తో యాక్టీవ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తోట నరసింహం జగ్గంపేట, పెద్దాపురం లోని తన అభిమానులని ఆక్టివ్ చేసారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీచేయడానికి అయన సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల మీడియాకు తెలిపారు ప్రజలకు జగన్ ఎంతో ఉపయోగకరమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని తోట నరసింహం తెలిపారు.

903 views