Nagarjuna: నాగచైనత్య పెళ్లిపై నాగార్జున సంచలన నిర్ణయం..

Posted by venditeravaartha, June 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అందులో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వర్ రావు నాటిని భీజం నుంచి ఇప్పటి అఖిల్ వరకు వరుసగా వారసులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. మూడో తరం వారసులైన అక్కినేనినాగచైతన్య, అఖిల్ లు ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. నాగచైతన్యకు కొన్ని సినిమాలు పేరు తీసుకురాగా.. అఖిల్ మాత్రం హిట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నాగచైతన్య గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య రెండో పెళ్లి గురించి అక్కినేని నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమన్నాడంటే?

nag family

‘ఏమాయ చేశావే’ సినిమా నాగచైతన్యకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆయన స్టార్ అయ్యారు. అలాగే ఇందులో నటించిన సమంత తో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరు ప్రేమాయణం సాగించి.. ఆ తరువాత చాలా రోజుల తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లపాటు ఎంతో ఎంజాయ్ చేసిన ఈ కపుల్స్ ఎవరూ ఊహించలేని విధంగా తాము విడిపోతున్నట్లు ప్రకటించలేదు.అప్పటి నుంచి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.

samantha

నాగచైతన్య(Naga chaitanya), సమంతలు(samantha) విడిపోయిన తరువాత మళ్లీ వరు కలుసుకుంటున్నారని కొందరు అన్నారు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూలో తగ్గేదేలే.. అన్నట్లు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇక వీరు ఎప్పటికీ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో శోభితా ధూళిపాళ్ల అనే నటితో నాగచైతన్య సన్నిహితంగా ఉంటున్నారని, త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

shobitha

శోభితా ధూళిపాళ్ల(Shobitha dulipalla) ‘గూఢాచారి’, ‘మేజర్’ అనే సినిమాల్లో అడవిశేషుతో కలిసి నటించింది. నాగచైతన్యతో మాత్రం నటించలేదు. మరి వీరిద్దరికి ఎలా పరిచయం అయింది? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కానీ శోభితా మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతోంది. అందులో ఒకరు అడవిశేషు కాగా.. మరొకరు నాగచైతన్య. అందుకే వీరి గురించి వార్తలు వస్తున్నాయని అంటున్నారు.

nagarajuna akhil chaitanya

ఈ క్రమంలో అక్కినేని నాగార్జున(Nagarjuna) సంచలన కామెంట్స్ చేసినట్లు సమాచారం. నాగచైతన్యతో పాటు తమ్ముడు అఖిల్ ల పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరి వివాహాలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనుకుంటున్నారు. నాగచైతన్య సమంతతో విడిపోయిన తరువాత వీరి గురించి వార్తలు ఆగడం లేదు. దీంతో తొందరగా నాగచైతన్యనకు వేరే పెళ్లి చేయడం ద్వారా వీటిని పులిస్టాప్ పెట్టవచ్చు అని ఆలోచిస్తున్నారు. అయితే ఆ పెళ్లి శోభితా దూళిపాళ్లతోనేనా? అని అనుకుంటున్నారు.

1090 views