పవన్ కళ్యాణ్ కోసం సొంత తమ్ముడిని త్యాగం చేసిన నాగార్జున..ఇంత ప్రేమ ఎందుకు?

Posted by venditeravaartha, September 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. వారి కుటుంబాలు తరచూ కలుస్తూ ఉంటాయి. చిరంజీవి, నాగార్జున ఇద్దరూ సొంత అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు. ఇండస్ట్రీలో ఆయనతో దాదాపు సరి సమానమైన స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కింగ్ నాగార్జున పబ్లిక్ లో పలు స్టేజీల మీద చిరంజీవి అన్నయ్యా అని సంబోధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ని కూడా నాగార్జున తన సొంత కొడుకు మాదిరిగానే భావిస్తాడు. ఈ క్రమంలోనే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి ఒక రోజు చరణ్ వచ్చినప్పుడు తను మా అన్న కొడుకు.

సంస్కారానికి మారు పేరు అంటూ రామ్ చరణ్ ను తెగ పొగిడేశాడు. అప్పటి నుంచి ఆ వీడియో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. అయితే మెగా స్టార్ చిరంజీవి కుటుంబం లో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి కానీ.. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ ను మాత్రం పెద్దగా కలిసింది లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నాగార్జున చాలా గొప్పగా తన అభిప్రాయాలను వెల్లబుచ్చుతాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు పాలిటిక్స్ , అటు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఎంతోమంది అభిమానుల్ని తన నటన, స్టైల్ తో సంపాదించుకున్నారు. ఇటు మన్మథుడు నాగార్జున కూడా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే వీళ్లద్దరి మధ్య అనుబంధం పెద్దగా లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం ఆయన పెద్ద త్యాగం చేశారు. పవన్ కోసం నాగార్జున తన తమ్ముడిని కూడా వదిలేసుకున్నాడట. తమ్ముడు అంటే నిజం తమ్ముడు అనుకునేరు.. కాదండి. నాగార్జున అప్పట్లో తను నటించబోయే కొత్త సినిమాకు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్. ఆ టైటిల్‎ని నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‎లో చెయ్యబోతున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించాడు.

అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా డైరెక్టర్ అరుణ్ కుమార్ అదే టైటిల్‎ని పెట్టాలని అనుకున్నాడు. అప్పటికే నాగార్జున ఈ టైటిల్‎ని రిజిస్టర్ చేయించి ఉన్నారని పవన్ కళ్యాణ్ కి చెప్పగా, వెంటనే నాగార్జునకి కాల్ చేసి మేం తీస్తున్న సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అవుతుందండి. దయచేసి మాకు వదిలేయగలరా అని అడిగాడట. వెంటనే నాగార్జున ఏం ఆలోచించకుండా ఓకే అనేశాడట. అలా పవన్ కళ్యాణ్ తో పెద్దగా సాన్నిహిత్యం లేకపోయినా కూడా అడగగానే ఇచ్చేశాడంటే నాగార్జున ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషో అర్థం చేసుకోవచ్చు.

237 views