NAGA CHAITANYA:డైరెక్టర్ పరశురామ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ ! నాగ చైతన్య ఘాటైన వ్యాఖ్యలు !

Posted by venditeravaartha, May 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక సినిమా కి కథ ,హీరో ,డైరెక్టర్ ని సెలెక్ట్ చేసి సినిమా ని స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సినిమా లు ఆగిపోతాయి,అయితే అవి చాల వరకు బడ్జెట్ ప్రాబ్లెమ్ వలన ,హీరో ల డేట్ లు కుదరకపోవడం వలన మధ్యలోనే ఆగిపోతాయి,కానీ కొన్ని సినిమా లు కావాలనే ఆగిపోతాయి,డైరెక్టర్ ,నిర్మాత,హీరో ల కి గొడవల కారణం గా చాల వరకు సినిమా ను మధ్యలోనే ఆపేస్తారు.కానీ నిర్మాత బడ్జెట్ కి ఒకే అని చెప్పి ,హీరో డేట్ లు ఇచ్చిన తర్వాత ఆ సినిమా ని తీయకుండా మధ్యలోనే ఆపేసి మరొక సినిమా చేసే డైరెక్టర్ లు చాల తక్కువ మంది ఉంటారు ఆ జాబితా లో కనిపిస్తున్నారు డైరెక్టర్ ‘పరశురామ్’.కస్టడీ సినిమా ప్రమోషన్ ల లో హీరో నాగ చైతన్య పరశురామ్ మీద చేసిన కామెంట్ లు ఇప్పుడు హాట్ న్యూస్ అయ్యాయి.

ఇటీవల ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు పరశురామ్ గురించి నాగ చైతన్యను అడగగా, దర్శకుడు పరశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్, అతను నా సమయాన్ని వృధా చేసాడు, ఈ అంశం గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు నాగ చైతన్య.గీత గోవిందం సినిమా తర్వాత నాగ చైతన్య తో సినిమా తీయాలి అని పరశురామ్ ఒక మంచి కథ తో చైతన్య ని కలిసి సినిమా ని కంఫర్మ్ చేసారు.స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంత జరిగిన తర్వాత ఈ సినిమా నుంచి బయట కి వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ‘సర్కారు వారి పాట’ సినిమా చేసారు.దిల్ రాజు బ్యానర్ లో VD12 ,గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత గోవిందం కి సీక్వెల్ కి ఒప్పుకుని వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ,ఆ సినిమా ల నుంచి బయట కి వచ్చేసారు పరశురామ్.

అయితే ఇన్ని వివాదాల నడుమ ఉన్న డైరెక్టర్ పరశురామ్ కెరీర్ గురించి ఒక సారి పరిశీలిస్తే పరశురామ్ 2008లో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యువత చిత్రంతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత, ఆంజనేయులు (2009), సోలో (2011), సారొచ్చారు(2012 ) ,శ్రీరస్తు శుభమస్తు (2016) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2018లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలతో గీత గోవిందం సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు, ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కార్ వారి పాట తో మరో బ్లాక్ బస్టర్ ని సాధించాడు.

701 views