Naga Chaitanya:తల్లికి దూరంగా నాగచైతన్య.. ఆమె అమెరికాలో ఉండడానికి గల కారణం అదేనా?

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత తన కుమారుడైన నాగచైతన్య కూడా ఇదే సినీ రంగం లోకి తీసుకువచ్చారు.తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంలో నాగచైతన్య సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.నాగార్జున మొదటి భార్య తనయుడు నాగచైతన్య అన్న విషయం అందరికీ తెలిసిందే, నాగచైతన్య తల్లి లక్ష్మీ దగ్గుపాటి. లక్ష్మీ అక్కినేని నాగార్జునను 1984 లో వివాహం చేసుకున్నారు. 1986లో నాగచైతన్య జన్మించారు. 1990లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత లక్ష్మీ దగ్గుపాటి దగ్గరే నాగచైతన్య పెరిగారు 19 సంవత్సరాలు నాగ చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. తాజాగా నాగచైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

అక్కినేని నాగార్జున తనయుల ఇద్దరినీ సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నాగచైతన్య ప్రతి సినిమాకు కూడా నాగార్జున అటెండ్ అయ్యి, సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. నాగచైతన్యకు ఎంతో సపోర్ట్ గా నాగార్జున నిలబడతారంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చైతు తల్లి మాత్రం కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. నాగచైతన్య రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తన తల్లి ఎంతో విలువలతో తనని పెంచిందని చైల్డ్హుడ్ స్కూల్ లైఫ్ అంతా ఆమెతో కలిసి చేసిన జర్నీ తన జీవితాన్ని మార్చేసిందని, ఆమె చాలా సిన్సియర్ గా ఉండే వాళ్లని చైతన్య చెప్పుకొచ్చారు.

ఆమె నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పే ప్రతి విషయాన్ని నేను చాలా ఇష్టంగా వినేవాడిని చెప్పుకొచ్చారు అయితే యాంకర్ నాగచైతన్య తన తల్లికి దూరంగా ఉండడానికి గల కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోవడమేనా అని అడగడంతో అప్పట్లో అలాంటి వార్తలు వచ్చాయని కానీ వాటిలో నిజం లేదని నేను హైదరాబాదులో ఉండడానికి నా సినిమాలే కారణమని, సినిమాల కోసమే నేను హైదరాబాదులో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆమె ఎప్పటినుండో అమెరికాలోనే ఉంటున్నారని చెప్పుకొచ్చారు. నాగచైతన్య సమంతతో కలిసి వివాహం చేసుకునే సమయంలో లక్ష్మీ దగ్గుపాటి కూడా వచ్చి తన కొడుకు కోడలు తో కొంతసేపు గడిపి తర్వాత గెస్ట్లా వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దగ్గుపాటి ఫ్యామిలీతో ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా నాగచైతన్య తల్లి నుండి దూరంగా ఉండడానికి గల కారణం తన సినిమాలే అని చెప్పుకు రావడం విశేషం..కానీ గతంలో చైతన్యతో ఎక్కువ కనిపించిన లక్ష్మీ దగ్గుపాటి ఈమధ్య తన కొడుకుతో కలిసి కనిపించడం లేదు. దాంతో ఆమె గురించి ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఆమె అవార్డు ఫంక్షన్లకు ప్రీమియర్ షోస్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

919 views