NAGA CHAITANYA:మా నాన్న సపోర్ట్ లేకుండా ఎదగాలి అనుకుంటున్నాము ! నాగార్జున గురించి నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు.

Posted by venditeravaartha, May 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

వారసత్వం అనేది సినిమా ల లో పనికి రాదు అది కేవలం లాంచింగ్ కోసం మాత్రమే పనికి వస్తుంది ,తర్వాత మన కి ఉన్న సక్సెస్ వలనే మాత్రమే మనం సినిమా ఫీల్డ్ లో రాణించగలము అని అంటున్నారు నాగ చైతన్య, వారసత్వం వలన వ్యాపారాలు చేసుకోవడానికి ,ఆస్తులని సంపాదించుకోవడం కోసం మాత్రమే పనికి వస్తుంది,సమాజం లో గుర్తింపు ,సినిమా ల ద్వారా వచ్చే సక్సెస్ కేవలం మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది అని అన్నారు.కస్టడీ సినిమా ప్రమోషనల్ లో బిజీ గా ఉన్న చైతన్య ని అక్కినేని ఫ్యామిలీ కి సరైన హిట్ వచ్చి చాల రోజులు అవుతుంది.

అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతన్య ,అఖిల్ గారికి బ్లాక్ బస్టర్ హిట్లు పడటం లేదు ,పెద్ద డైరెక్టర్ తో సినిమా లు లేవు అని అడిగిన ప్రశ్న కి సమాధాం ఇస్తూ ‘మా తాత గారు లెజెండరీ అక్కినేని నాగేశ్వర రావు గారు ,మా నాన్న నాగార్జున గారు అక్కినేని ఫ్యామిలీ లెగసీ ని మోస్తూ వచ్చారు,నాన్న గారికి ఆ టైం లో తాత గారు సినిమా ల లోకి తీసుకుని వచ్చి సపోర్ట్ గా ఉన్నారు అంతే కానీ ఫలానా డైరెక్టర్ ని తీసుకుని వచ్చి నా కొడుకు తో సినిమా తీయండి అంటూ ఎప్పుడు చేయలేదు ,నాన్న గారు ఈ స్థాయి కి రావడం కి ఆయన తీసుకున్న నిర్ణయాలు ,ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ లు ,డైరెక్టర్ లు ,నిర్మాత లు.

.అఖిల్ కానీ నేను కానీ ఇప్పటికిప్పుడు ఫలానా డైరెక్టర్ తో పని చేయాలి అని ఉంది అని అడిగితే వెంటనే కార్ లో ఆ డైరెక్టర్ ఆఫీస్ కి తీసుకుని వెళ్లి సినిమా సెట్ చేస్తారు.మీకు ఏ డైరెక్టర్ కావాలో అడగండ్రా అడ్వాన్స్ పంపిస్తాను అని చాల సార్లు అడిగారు,మాకు పెద్ద సినిమా లు రావడం లేదు అని ,పెద్ద హిట్లు రావడం లేదు అంటే అందులో నాన్న తప్పు ఏమి లేదు,మేము వారి మీద ఆధారపడకుండా ఎదగాలి అనుకుంటున్నాము అని చెప్పారు.

450 views