Nagachaitanya: సమంత ని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన నాగ చైతన్య..వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!

Posted by venditeravaartha, May 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Nagachaitanya: సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత నాగ చైతన్య జంట మన అందరికీ ముందుగా గుర్తుకు వస్తారు. ఈ జంట ‘ఏం మాయ చేసావే’ సినిమాతో కలిశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మొత్తం మన కళ్లారా చూసాము, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముచ్చటైన జంట కావడం తో దిష్టి ఎవ్వరు ఊహించని రీతిలో పడిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించే ఈ జంట విడిపోయింది అంటే ఇప్పటికీ నమ్మలేని అభిమానులు అసంఖ్యాకంగా ఉంటారు. వీళ్లిద్దరు మళ్ళీ కలిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ అది జరగడం అసాధ్యం. అయితే భవిష్యత్తులో మాత్రం వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశం అయితే కచ్చితంగా ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడితే అక్కినేని కుటుంబానికి ‘మనం’ సినిమా ఎంత ప్రత్యేకమైనదో చెప్పనవసరం లేదు. నాగ చైతన్య, నాగార్జున, అఖిల్, సమంత ఇలా అందరూ కలిసి అక్కినేని నాగేశ్వర రావు తో నటించిన అరుదైన అవకాశం కల్గింది.

ఈ సినిమానే నాగేశ్వర రావు చివరి సినిమా అవ్వడం, ఆ చిత్రం పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా నిల్చింది. ఈ సినిమాని రీసెంట్ గానే మరోసారి రీ రిలీజ్ చెయ్యగా, అక్కినేని నాగ చైతన్య థియేటర్ కి వెళ్లి చూసాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆయన నాగేశ్వర రావు, సమంత సన్నివేశాలు వచ్చినప్పడు కంట తడి పెట్టుకోవడాన్ని అక్కినేని అభిమానులు గమనించారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నాగేశ్వర రావు తాతయ్య కాబట్టి ఎమోషనల్ అయ్యి ఏడవడం లో వింతేమీ లేదు. కానీ విడిపోయిన సమంత ని తలచుకొని ఏడ్చాదంటే ఆమెపై ఉన్న ప్రేమ ఇంకా చావలేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దూరం గా ఉండడం, మళ్ళీ కలిసిపోవచ్చు కదా అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సమంత విషయానికి వస్తే మయోసిటిస్ ట్రీట్మెంట్ చేయించుకున్న ఆమె, డాక్టర్ల సలహా మేరకు గత ఆరు నెలల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. మరో ఆరు నెలలు కూడా ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

234 views