Mrunal Thakur:మృణాల్ ఠాకూర్ అక్క ఇంత హాట్ గా ఉందేంటి..కుర్రాళ్ళు చూస్తే మెంటలెక్కిపోతారు!

Posted by venditeravaartha, May 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Mrunal Thakur: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈమె ‘సీతరామం’ చిత్రంతో మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన అభినయం తో మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే దుమ్ము లేపేసింది. ఈ సినిమాకి ముందు ఆమె బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పలు డైలీ సీరియల్స్ కూడా చేసింది. కానీ ఇన్ని చేసినా రాణి స్టార్ స్టేటస్ టాలీవుడ్ లో వచ్చింది. ఆమెకి వచ్చిన ఈ స్టార్ స్టేటస్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది. అందరి హీరోయిన్స్ లాగ కాకుండా, ఈమె కేవలం నటన, కథ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తుంది.

ఆడియన్స్ కూడా ఆమె సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. సీతారామం తర్వాత ఆమె చేసిన ‘హాయ్ నాన్న’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, నటిగా మృణాల్ ఠాకూర్ ని మరో మెట్టు ఎక్కించింది. కానీ రీసెంట్ గా విజయ్ దేవరకొండతో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. సరైన స్టోరీ లేకపోవడం వల్ల ఈ చిత్రానికి ఆ పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆమె తదుపరి చిత్రాన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకొని చేయబోతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘పూజా మేరీ జాన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ లో ఒక ముఖ్య పాత్ర పోషించబోతుందని టాక్.

ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండే మృణాల్ ఠాకూర్ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన సోదరి లోచన్ ఠాకూర్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అవి తెగ వైరల్ గా మారింది. హీరోయిన్స్ తో సరిసమానమైన అందంతో లోచన్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్ కి ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా ఉంది. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ ఇస్తే మాత్రం మంచి రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం కొన్ని అందిస్తున్నాము చూడండి.

Tags :
425 views