Chiru-Venkey: చిరంజీవి ,వెంకటేష్ కాంబినేషన్ లో ఆగిపోయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా ?

Posted by venditeravaartha, June 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ టాప్ హీరో ల లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ,వెంకటేష్(Venkatesh) గార్ల కి ప్రత్యకమైన స్టైల్ ఉంది చిరంజీవి గారు డాన్స్ ,ఫైట్ ,ఎమోషన్ మరియు కామెడీ తో అలరించి మాస్ హీరో గా ఎదిగారు ఇక తన లోనే హ్యూమర్ ,ఎమోషన్ ,సెంటిమెంట్ ల తో ఫ్యామిలీ ప్రేక్షకులని అలరించి ఫ్యామిలీ హీరోగా అందరి చేత మన్నలను పొందడమే కాకుండా ఒక్క నెగటివ్ ఫ్యాన్ కూడా లేని హీరో గా ఉన్నారు వెంకటేష్.మొదట నుంచి స్నేహ భావం తో ఉండే చిరంజీవి,వెంకటేష్ గార్లు అప్పట్లో ఒక భారీ మల్టీ స్టారర్ చేయాలనీ భావించారు.

chiru venkey

1994 లో సల్మాన్ ఖాన్(Salman khan) ,అమిర్ ఖాన్(Amir khan) కలిసి నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అందాజ్ అప్నా అప్నా మూవీ ని తెలుగు లో రీమేక్ చేయాలి అని ప్లాన్ చేసారు.ఇక అప్పటికే చిరంజీవి ,వెంకటేష్ ల కి అల్లుడా మజాకా ,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ,అబ్బాయిగారు వంటి బ్లాక్ బస్టర్ లను ఇచ్చిన EVV సత్యనారాయణ గారు ఈ సినిమా ని డైరెక్ట్ చేయడానికి హిందీ లో ఉన్న కథ కి మన నేటివిటీ కి తగ్గట్లు మార్పులు చేసారు.వెంకటేష్ ,చిరంజీవి ఇద్దరు ఈ సినిమా ని చేయడానికి ఒప్పుకోవడం తో రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గా సినిమా ని స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు.

salman ameer

కానీ ఆ టైం లో చిరంజీవి గారు బిగ్ బాస్ ,రిక్షవాడు ,మాస్టర్ ,హిట్లర్ సినిమా ల తో బిజీ గా ఉండటం అలానే వెంకటేష్ గారు కూడా పోకిరిరాజా ,ధర్మ చక్రం ,సరదా బుల్లోడు మరి కొన్ని ప్రాజెక్ట్ ల తో బిజీ గా ఉండటం తో డైరెక్టర్ గారు ఈ సినిమా ని ఆపేసారు.ఇక ఇదే సినిమా అప్పట్లో రిలీజ్ అయి ఉంటె ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధించేది.ఇద్దరు బెస్ట్ కామెడీ టైమింగ్ కలిగిన చిరంజీవి ,వెంకటేష్ కలిసి సినిమా చేస్తే ఫాన్స్ కి పండగే ఇక.ఈ మధ్య నే బాలీవుడ్ లో వెంకటేష్ గారు సల్మాన్ ఖాన్ గారి కిసి కి భాయ్ కిసి కా జాన్ సినిమా లో నటించగా చిరంజీవి గారి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కనిపించి అలరించారు.

salman with chiru and venkey

697 views