Mohan babu: కొడుకుని పాన్ ఇండియన్ హీరో చేస్తా అంటున్నా మోహన్ బాబు ! 100 కోట్ల బడ్జెట్ తో మూవీ.

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మంచు మోహన్ బాబు(Mohan babu) ఒకప్పుడు ఈ పేరు వినగానే కలెక్షన్ కింగ్ అనే పేరు గుర్తు వచ్చేది దానికి కారణం ఆయన నటించిన చిత్రాలు ,అయన చేసిన పాత్రలు.విల్లన్ గా సినీ కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత కలెక్షన్ కింగ్ గా మారిన మోహన్ బాబు గారి కెరీర్ చాల మలుపులు తిరిగింది అంటారు.. అల్లరి మొగుడు ,అసెంబ్లీ రౌడీ ,పెదరాయుడు మొదలగు బ్లాక్ బస్టర్ సినిమా లు కలిగిన ఈయన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ స్థాపించి మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా ల కి నిర్మాత గా వ్యవహరించారు. అయితే గత కొంత కాలం గా సక్సెస్ లేక వరుస అపజయాలని చూస్తున్న మోహన్ బాబు ఇప్పుడు తన కుమారుడు అయినా మంచు విష్ణు తో ఒక భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని తీయాలి అని ప్లాన్ చేస్తున్నాడు.

mohan babu

ఇటీవల మోహన్ బాబు నటించిన సన్ అఫ్ ఇండియా(Son of india) డిజాస్టర్ కావడం అలానే తన కొడుకు నిర్మాత గా హీరో గా చేసిన మోసగాళ్లు సినిమా మరో పెద్ద డిజాస్టర్ కావడం తో వీరి సినిమా ల కి మార్కెట్ తగ్గిపోయింది.ఒకప్పుడు స్టార్ హీరోలు అయినా చిరంజీవి ,బాలయ్య ల తో పోటీ పడిన మోహన్ బాబు ఇప్పుడు టయర్ 3 హీరో ల తో కూడా పోటీ పడలేక పోతున్నారు.వారి కొడుకు ల లో మంచు మనోజ్ కొంచెం పర్లేదు అనే సినిమా లు చేస్తుంటే మోహన్ బాబు ,విష్ణు మాత్రం వరుసగా ప్లాప్ లు చేస్తున్నారు.

son of india

మోహన్ బాబు ఇప్పుడు విష్ణు(Vishnu) ని ప్రధాన పాత్రా లో పెట్టి ఒక భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం వారి విద్య సంస్థలు అయినా విద్యానికేతన్ మరియు మోహన్ బాబు యూనివర్సిటీ ల ను బేస్ చేసుకుని ఉండబోతుంది అంట.అక్కడ ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది ,స్టూడెంట్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ అందచేస్తున్నారు అనేవి ప్రధానంగా చూపించే ప్రయత్నం చేయనున్నారు.ఇక ఈ సినిమా కి కథ ,మాటలు మోహన్ బాబు మరియు విష్ణు అందిస్తుండగా డైరెక్టర్ ఎవరు అనేది త్వరలోనే చెప్పనున్నారు.ఈ భారీ చిత్రాన్ని 5 బాషల లో తీస్తూ 100 కోట్ల బడ్జెట్ తో తీయనున్నారు.

Mbu

923 views