Balakrishna : ఛీ.. ఛీ వీళ్లు మారరు.. సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన మోహన్ బాబు

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణకు సినీ పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ అందుకోవడంతో స్టార్ హీరోగా ఎదిగారు బాలకృష్ణ. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్ తో తన ఖాతాలో వేసుకుని యువ హీరోలతో పోటీపడుతున్నాడు. సీనియర్ స్టార్ హీరోలందరి మధ్య మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య తన 109వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ సీక్వెల్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా నటించిన ఓ సినిమాలో మోహన్ బాబుకు కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని, కానీ ఆయన ఓ సిల్లీ రీజన్ తో రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. మోహన్ బాబు చెప్పిన ఆ కారణం ఏంటో తెలుసుకుందాం. గతంలో బాలకృష్ణ సుల్తాన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలకృష్ణను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అడిగారు. మోహన్ బాబు నటించినని చెప్పేసిన‌ట్లు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు మోహన్ బాబు నటించిన ఓ సినిమాలో బాలయ్యను గెస్ట్ రోల్ లో నటించమని అడిగాడట.

బాలకృష్ణ సినిమాలో గెస్ట్ రోల్ చేయలేదన్న కారణంతోనే సుల్తాన్ సినిమాలో ఛాన్స్ వచ్చినా మోహన్ బాబు తిరస్కరించాడని తెలిసింది. ఇక చేసేదేమీ లేక బాలయ్య క్యారెక్టర్‌కు కృష్ణంరాజును అడిగి చేయించారట. అప్పట్లో దీనికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక తర్వాత బాలయ్య, మోహన్ బాబు మళ్లీ ఎటువంటి గొడవలు లేకుండా కలిసి పోయారు. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయినా బాలకృష్ణ క్యారెక్టర్ కి మాత్రం భారీ హైప్‌ వచ్చింది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు ఎటువంటి సినిమాల్లోని నటించకుండా ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

351 views