Chiranjeevi:మహేష్ బాబు ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి చిందులు..అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, March 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ డైరెక్టర్ బింబిసారా ఫేమ్ వశిష్ట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ గా ఈ మూవీని వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. బింబిసారతో సూపర్ హిట్ అందుకుని ఇప్పుడు మెగాస్టార్ తో మూవీ చేస్తున్నాడు వశిష్ట.

ఈ విశ్వంభరా మూవీ పోస్టర్ రిలీజ్ అయిన క్షణం నుండి మెగా ఫాన్స్ భారీ స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిషనటిస్తున్నారు. ఇషా చావ్లా సురభి ఈ మూవీలో అవకాశం దక్కించుకున్నారు. చిరంజీవితో పాటు త్రిష 18 సంవత్సరాల తరువాత నటిస్తుండడం విశేషం. ఈ మూవీలో విలన్ గా,బిగ్ క్యారెక్టర్స్,కోసం పెద్ద నటులను తీసుకుంటున్నట్లు సమాచారం. స్టాలిన్ మూవీ లో వీరిద్దరూ నటించారు ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభర లో చిరంజీవి పక్కన త్రిష నటించనున్నారు. వెకేషన్ పూర్తయిన తరువాత, ఈ మూవీలో చిరంజీవి గారు షూటింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి గారు హైదరాబాదులో గుంటూరు కారం మూవీ కోసం వేసిన ఇంటి సెట్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు ఇంటి సెట్ ను కొంత మార్పులు చేసి చిరంజీవిగారి ఇల్లు గా మార్చారుట. ప్రస్తుతం ఈ మూవీ హీరోయిన్స్ త్రిష తో పాటు సురభి, ఇషా చావ్లా తో చిరంజీవితో కొన్ని సీన్లు, అలాగే చిరంజీవి త్రిషాల డాన్స్ మూమెంట్స్ ను ఈ ఇంట్లోనే షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సరసనా త్రిష నటిస్తుండడంతో వారి అభిమానులు ఆనందంతో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

454 views