Avantika Vandanapu : ఆమే నాకు స్ఫూర్తి.. సమంతను అమాంతం పొగడ్తలతో ముంచేసిన హాలీవుడ్ హీరోయిన్

Posted by RR writings, March 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Avantika Vandanapu : చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్‌లో పలు అవకాశాలను అందుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా తెలుగు సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల ఇక్కడ షూటింగ్ చేసిన రోజులను గుర్తు చేసుకుంది. సమంత, కాజల్, నాగ చైతన్యతో గడిపిన క్షణాలు మధురమైనవని తెలిపారు. ‘భారత నటీనటులు హాలీవుడ్‌లోనూ రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. వారిలో నేనూ భాగమవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నేను టాలీవుడ్‌లో నటించినప్పుడు అక్కడి నటీనటులంతా బాగా చూసుకున్నారు. ‘ప్రేమమ్‌’ సెట్‌లో నాగచైతన్య చాలా ప్రేమ చూపేవారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వారికి సమంత, కాజల్‌ అగర్వాల్‌ ఎంతో సపోర్ట్‌ చేస్తారు. నాపై కూడా వీళ్లిద్దరూ అపారమైన ఆప్యాయత చూపారు. సమంత ఇప్పుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆమె విజయమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. హాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సిందేనని అవంతిక తెలిపింది. భారతీయ చిత్ర పరిశ్రమకు హాలీవుడ్‌కు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు బంధుప్రీతి, వర్ణవివక్ష వంటి సవాళ్లను కూడా అధిగమించాలన్నారు.

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’తో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది అవంతిక వందనపు. ఆ తర్వాత ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దం’, ‘బాలకృష్ణుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో కనిపించాడు. ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మీన్ గర్ల్స్-ది మ్యూజికల్’లో ఆమె లీడ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే.. సమంత, కాజల్ అగర్వాల్, నాగ చైతన్య (ప్రేమమ్) తనను ఎప్పుడు సపోర్ట్ చేసేవారని అవంతిక చెప్పింది. “సమంత, కాజల్ అగర్వాల్ ఎంతో లవ్లీ, చాలా మంచివారు. అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువతి పట్ల సమంత చూపిన ప్రేమ, అభిమానం చాలా గొప్పది. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆమె నాపై చూపించిన ఆప్యాయత నాకు ఎంతో అపారమైనది. సమంత ఇప్పుడు చాలా గొప్ప పనులు చేస్తుంది. కాజల్ కూడా అలాగే. వారిని సక్సెస్ చాలా స్ఫూర్తిదాయకం. సెట్‌లో నాగ చైతన్య గారు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. అది నాకు బాగా గుర్తు ఉంది” అంటూ అవంతిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అవంతిక వందనపు ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ ఎ క్రౌన్ ఆఫ్ విషెస్, అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న నిత్యా మెహ్రా బిగ్ గర్ల్స్ డోంట్ క్రై చేస్తున్నట్లు అవంతిక తెలిపింది.

Tags :
334 views