Anant Ambani : అనంత్ అంబానీ చేతి వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Posted by RR writings, March 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Anant Ambani : రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అనంత్ అంబానీ, ఆయన కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులను అలరించేందుకు సంగీత కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే పాప్ సింగర్ రిహన్నాతో కలిసి ఓ షో చేయించారు. దానికి ఆమెకు రూ.9కోట్ల వరకు చెల్లించినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ అంతా చాలా బిజీగా ఉంది. ఈ వేడుకల్లో అడుగడుగునా అంబానీల వైభవం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలే దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంత్ అంబానీ మార్క్ జూకర్ బర్గ్ కుటుంబంతో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. అనంత్ వారిని అంబానీ మర్యాద గురించి అడుగుతాడు. అదే సమయంలో వారు ఇక్కడ ఏదైనా ప్రదేశాలు చూడాలనుకుంటే, వారు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే సమయంలో, మార్క్ జుకర్‌బర్గ్ భార్య ప్రిస్సిల్లా చాన్ అనంత్‌ చేతి పై ఖరీదైన డిజైనర్ వాచ్‌ని చూసింది. ఆ వాచ్ ఆడెమర్స్ ప్యూగట్ రాయల్ ఓక్ ఓపెన్ వర్క్ డ్ స్కెలెటన్ అని అనంత్ వివరించారు. ఆ వాచ్ ఖరీదు రూ.14 కోట్లు అని చెప్పడంతో జుకర్ బర్గ్‌తో సహా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ ప్రస్తుతం అవుతోంది.

607 views