Manchu manoj:మంచు విష్ణు మా ఇంటి కి వచ్చి మా బంధువులని కొడతాడు

Posted by venditeravaartha, March 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు తెలుగు సినిమా లో ఒక లెజెండ్ ,అనడం ఏ మాత్రం సందేహం లేదు ,హీరో గా ,విల్లన్ ,కమెడియన్ ,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైన సినిమా ల లో నటించారు, లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానేర్ పెట్టి 40 కి పైగా సినిమాలను నిర్మించారు,అలానే విద్యానికేతన్ విద్య సంస్థలను స్థాపించారు. టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుని గా కూడా చేసారు మోహన్ బాబు గారికి 3 పిల్ల లు మొదటి భార్య అయినా విద్య దేవి గారికి ‘మంచు లక్ష్మి ‘ , ‘మంచు విష్ణు ‘, రెండవ భార్య అయినా నిర్మల దేవి గారికి ‘మంచు మనోజ్’ జన్మించారు.అయితే మొదటి నుంచి కలిసి మెలిసి ఉన్న మంచు ఫ్యామిలీ గత కొంత కాలం గా వేరు వేరు గా ఉంటున్నారు, ఇది వరకు కొన్ని సార్లు మనోజ్ ,విష్ణు కి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి అన్ని కొన్ని మీడియా ల లో వార్తలు వచ్చాయి ,వాటిని అప్పట్లో మంచు ఫ్యామిలీ ఖండించారు.

కానీ ఈ మధ్య కాలం లో ఇటువంటివి ఇంకొంచెం పెరిగినట్లే కనిపిస్తున్నాయి,మంచు ఫ్యామిలీ లో మోహన్ బాబు ,విష్ణు ,లక్ష్మి ఒక సైడ్ ఉన్నారు అని ,మనోజ్ మాత్రం వీళ్ళతో కలవకుండా వేరే గా ఉన్నారు అని వార్తలు వచ్చాయి , గత 2 సంవత్సరాల నుంచి మంచు ఫ్యామిలీ మీద వీపరీతమైన ట్రోల్ల్స్ వచ్చినప్పటికీ అందులో మనోజ్ లేకపోవడం ఒక రకంగా మనోజ్ వైఖరి ఏంటో అందరికి తెలుస్తుంది. ఇండస్ట్రీ లో ఉన్న అందరి తో సఖ్యత తో ఉంటారు మనోజ్.

గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ కి, విష్ణుకి మధ్య మాటలు లేవని తెలుస్తుంది. ఇటీవల మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మనోజ్, విష్ణు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ అవుతుందని వార్తలు వచ్చాయి. మనోజ్ రెండో పెళ్లి కూడా విష్ణుకి ఇష్టం లేనట్టు తెలుస్తుంది.
తాజాగా మంచు మనోజ్, విష్ణు గొడవ బయటకి వచ్చింది.

మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని తన ఫేస్ బుక్ స్టోరీలో పెట్టి.. విష్ణు ఇలా వచ్చి అప్పుడప్పుడు నా మనుషులను కొడతాడు అని మనోజ్ తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విష్ణు మనోజ్ కి చెందిన మనుషులపై కోప్పడటం, కొట్టడానికి ట్రై చేస్తుండటం ఉంది.ఇన్నాళ్లు సైలేంట్ గా ఉన్న వీళ్ళు మంచు మనోజ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అన్నదమ్ముల మధ్య విబేధాలు రోడ్డుకెక్కాయి. సోషల్ మీడియాలో, మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇంకా ఈ వివాదంపై ఎవరూ స్పందించలేదు. నిన్న తన ఫేస్బుక్ లో పెట్టిన వీడియో ఇప్పుడు మనోజ్ డిలీట్ చేసి ఉన్నారు,మోహన్ బాబు గారు డిలీట్ చేయించారా ? లేక ఏమైనా సినిమా ప్రమోషన్ కోసం ‘ఫ్రాంక్ వీడియో ‘ ప్లాన్ చేసారో తెలియాలి.

802 views