Mahesh-Trivikram: పవర్ ఫుల్ టైటిల్ తో మహేష్ ,త్రివిక్రమ్ మూవీ ! మే 31 న ఫస్ట్ లుక్.

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి విపరీతమైన క్రేజీ ఉంటుంది అందులో ఒకటి మహేష్ బాబు(Mahesh babu),త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) ల ది వీరి కలయిక లో ఇది వరకు వచ్చిన ‘అతడు’,’ఖలేజా’ సినిమా ల లో అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ,ఖలేజా సినిమా థియేటర్ ల లో డిజాస్టర్ అయినా టీవీ ల లో దానికి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనే చెప్పాలి.13 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలయిక లో రాబోతున్న SSMB 28 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు గారి గత చిత్రం ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ కావడం అలానే త్రివిక్రమ్ గారి ‘అలా వైకుంఠ పురములో ‘ సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో ఇప్పుడు వీరి కలయిక లో వస్తున్న SSMB 28 సినిమా మీద అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కొంతకాలం తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు కొన్ని విభేదాలు ఉన్నాయని దాని వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది అనే పుకార్లు వ్యాపించాయి,దీని వలన షూటింగ్ అంత గ్రౌండ్ స్థాయి కి వచ్చింది అని వార్తలు వచ్చాయి.. అయితే ఆ తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ విభేదాలను తొలగించి, వీలైనంత త్వరగా సినిమా ని పూర్తి చేసే పని లో ఉన్నారంట. అలాగే, సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ నుండి ప్రారంభమవుతుంది మరియు కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ఎటువంటి విరామం లేకుండా షూటింగ్ నాన్‌స్టాప్‌గా సాగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 31 మే 2023న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ కోసం చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి, అందులో ‘గుంటూరు కారం’,’అమరావతి కి అటు ఇటు’,’అయోధ్య లో అర్జునుడు ‘ వంటి పేర్లు ప్రచారం లో ఉన్నాయి, అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం మహేష్ మరియు త్రివిక్రమ్ తమ అభిమానులందరినీ థ్రిల్ చేసే విధముగా టైటిల్‌ను పెట్టనున్నారు.ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు మరియు చిత్రం 13 జనవరి 2024 న విడుదల కానుంది.

3511 views