టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ల లో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు,మొదట డైలాగ్ రైటర్ గా వచ్చిన ఈయన ఆ తర్వాత విజయ్ భాస్కర్ గారికి స్టోరీ రైటర్ గా పని చేసారు,ఆయన రాసిన కథ ల లో నువ్వే కావాలి ,నువ్వు నాకు నచ్చావు,మల్లేశ్వరి ,జై చిరంజీవ ,స్వయంవరం ,చిరునవ్వుతో వంటి బ్లాక్ బస్టర్ సినిమా లు ఉన్నాయి.ఇక ఆయన మొదట సరిగా తరుణ్ తో చేసిన నువ్వే నువ్వే తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.తన డెబ్యూ మూవీ తోనే బ్లాక్ బస్టర్ సాధించిన త్రివిక్రమ్ తన రెండవ సినిమా ని పవన్ కళ్యాణ్ గారితో చేయాలి కానీ అంతకుముందే మురళి మోహన్ గారికి ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథ తోనే మహేష్ బాబు తో అతడు గా చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.సినిమా బ్లాక్ బస్టర్ అయినా నిర్మాతలకి నష్టాలు వచ్చాయి అని ఆ తర్వాత ప్రొడ్యూసర్ మురళి మోహన్ గారు చెప్పారు.
2002 నువ్వే నువ్వే తర్వాత వెంటనే అతడు స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని 2003 లో షూటింగ్ స్టార్ట్ చేసారు.అయితే అప్పటికే ఒక్కడు సినిమా పూర్తి చేసుకుని నిజం ,నాని ,అర్జున్ సినిమా ల తో బిజీగా ఉన్న మహేష్ అతడు సినిమా కోసం ఎక్కువ డేట్ లు ఇవ్వలేకపోయారు.అయితే ఆ తర్వాత డేట్స్ దొరినప్పటికీ త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని బాగా లేట్ చేసారు అని టాక్ ఉంది.అనుకున్న బడ్జెట్ కి అంటే డబల్ పెరగడం తో సినిమా బ్లాక్ బస్టర్ అయినా వాళ్ళకి నష్టాలు మిగిలాయి.అతడు సినిమా కోసం త్రివిక్రమ్ దాదాపు రెండు సంవత్సరాలు తీసుకుని 2005 లో రిలీజ్ చేసారు.మొదట డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమా 100 డేస్ రన్ లో సూపర్ హిట్ అయింది.ఇక కొన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకుని వీరు కలిసి చేసిన సినిమా ఖలేజా.
మహేష్ ,త్రివిక్రమ్ ,అనుష్క గారి కలయిక లో సింగనమల రమేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన ఖలేజా మూవీ 2010 అక్టోబర్ 7 న రిలీజ్ అయింది.అతడు సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఖలేజా
మూవీ కి భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసారు.మూవీ కల్ట్ సినిమా అయినప్పటికీ అప్పటి ప్రేక్షకులకి అర్ధం కాకపోవడం తో డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఖలేజా సినిమా కోసం వీరు
దాదాపు మూడు సంవత్సరాలు టైం తీసుకున్నారు.2007 లో రిలీజ్ అయినా అతిధి సినిమా తర్వాత మూడు సంవత్సరాలు కేవలం ఖలేజా కోసం కేటాయించిన మహేష్ బాబు చివరకి డిజాస్టర్ ని ఇచ్చారు .సినిమా ని స్టార్ట్ అయ్యి మధ్య లో ఆగిపోయి మరల స్టార్ట్ అయ్యి ఇలా మూడు సంవత్సరాలు చేసిన సినిమా చివరికి ప్లాప్ గా నిలిచింది.
ఖలేజా తర్వాత త్రివిక్రమ్ గారు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ ల లో ఒకరు గా నిలవగా మహేష్ వరుస బ్లాక్ బస్టర్ ల తో టాప్ ప్లేస్ లో ఉన్నారు.ఇక 13 ఇయర్స్ తర్వాత వీరు ఇద్దరు కలిసి గుంటూరు కారం తో మన ముందుకు రానున్నారు.అయితే సినిమా స్టార్ట్ అయ్యి రెండు ,మూడు షెడ్యూల్ పూర్తి అయినా ఈ సినిమా నుంచి కొంత మంది తప్పుకున్న విషయం తెలిసిందే..
అయితే 2024 సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది అనుకున్న గుంటూరు కారం ఇప్పుడు సమ్మర్ కి వాయిదా అయ్యేలా ఉంది.అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్ ల తో సంవత్సరం లోపు సినిమా పూర్తి చేసే త్రివిక్రమ్ మహేష్ బాబు తో వచ్చే సరికి రెండు ,మూడు సంవత్సరాలు తీసుకోవడం ఆశ్చర్యం గా ఉంది.