Leo Movie : ‘లియో’ తెలుగు వెర్షన్ 12 కోట్లు పెట్టి కొన్నారు..ఒక్క రోజులో వచ్చిన లాభాలు ఎంతో తెలుసా!

Posted by venditeravaartha, October 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Leo Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబో అన్నప్పటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు లియో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, లియో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 140కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విజయ్ కెరీర్ లోనే ఇదో సాలిడ్ ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సంజయ్ దత్, అర్జున్, త్రిష వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు.

విజయ్ లియో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 17 కోట్ల షేర్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తమిళనాడులో రూ. 100 కోట్లు, కర్ణాటకలో రూ. 15.50 కోట్లు, కేరళలో రూ. 13.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రూ. 60 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా రూ. 216 కోట్ల షేర్, రూ. 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ పోటీలో నిలుచుంది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ 2800 థియేటర్లలో విడుదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 500 థియేటర్లలో విడుదలైంది. వాస్తవానికి లియో చిత్రం రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని సమాచారం. ఈ సినిమా తొలిరోజు రూ. 150 కోట్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 17 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అలాగే తమిళనాడులో రూ. 32 కోట్లు, కేరళలో రూ. 12.50 కోట్లు, కర్ణాటకలో రూ. 14.50 కోట్లు, వేరే రాష్ట్రాల్లో రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా భారత్‌లో రూ. 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ. 65 కోట్లు.. మొత్తంగా ఫస్ట్ డే లియో సినిమా రూ. 145 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. లియో సినిమాతో విజయ్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. లియోకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ గ్రాండ్ ఓపెనింగ్స్ రావడానికి ఒక కారణం దర్శకుడు లోకేష్ కూడా. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఆయన సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. వీకెండ్ కావడంతో లియో కలెక్షన్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

595 views