KGF: కెజిఫ్ చాప్టర్ 3 నుంచి లేటెస్ట్ అప్డేట్ !

Posted by venditeravaartha, May 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజమౌళి బాహుబలి(Bahubali) సినిమా తర్వాత సౌత్ ,నార్త్ సరిహద్దులను చెరిపేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన సినిమా కెజిఫ్(KGF).రాకింగ్ స్టార్ యాష్(Yash),ప్రశాంత్ నీల్ కలయిక లో వచ్చిన ఈ మూవీ కన్నడ తో పాటు తెలుగు,హిందీ ల లో హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టింది.ఇండియన్ సినిమా ల లో 1000 కోట్లు కలెక్ట్ సాధించిన సినిమా ల లో కెజిఫ్ ఒకటిగా నిలిచి రికార్డు ల ని సృష్టించింది. గత సంవత్సరం విడుదలైన KGF చాప్టర్ 2 ముగింపులో, KGF 3 గురించి ఒక హింట్ ఇచ్చారు . KGF 3 మూవీ కోసం యావత్ ఇండియా అంతటా ఎదురుచూస్తుంది ఇలాంటి సమయం లో ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ బయటకి వచ్చింది.

Kgf chapter 2

 

గత సంవత్సరం యాష్ పుట్టినరోజు సందర్భంగా కెజిఫ్ మూవీ ప్రొడ్యూసర్స్ కెజిఫ్ చాప్టర్ 3 త్వరలోనే ఉండబోతుంది అని, 2024లో సెట్స్‌పైకి వెళ్లవచ్చని తెలియాచేసారు.ఇప్పుడు కెజిఫ్ 3 కోసం ఊహించిన దాని కంటే కొంచెం ఎక్కువ వేచి ఉండేలా ఉంది KGF లాంటి  సినిమా ని అందించిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్(Prasanth neel) ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారితో సాలార్ మూవీ ని తీస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సాలార్ తర్వాత, జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31  ప్రారభించనున్నారు ప్రశాంత్ నీల్. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత, KGF 3 మూవీ ని సెట్స్ మీదకి తీసుకుని వెళ్లనున్నారు.

Yash and prasanth neel

ప్రస్తుతం యాష్ ,ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా కెజిఫ్ చాప్టర్ 3 మీద అంత ఆసక్తి గా లేరు అనేది బయట కి వస్తున్న న్యూస్.కెజిఫ్ చాప్టర్ 1 ,కెజిఫ్ చాప్టర్ 2 ల కి మొదటగా నే స్క్రిప్ట్ ని డెవలప్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ ,ఎన్టీఆర్ సినిమా ల తో బిజీ గా ఉండటం తో కెజిఫ్ చాప్టర్ 3 కథ ని పక్కన పెట్టారు అని వార్త.1200 కోట్ల పైన కలెక్ట్ చేసిన కెజిఫ్ తర్వాత రానున్న చాప్టర్ 3 మీద భారీ అంచనాలు ఉంటాయి.కన్నడ లో కెజిఫ్ ,కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ ల ను తీసుకుని వచ్చిన హోంబలే ఫిలిమ్స్ ఏ కెజిఫ్ చాప్టర్ 3 ని కూడా తీయనున్నారు.అయితే
హోంబలే(Homble) ఫిలిమ్స్ కి చెందిన విజయ్ కిరగందూర్ కూడా KGF 3 కోసం అనేక ఆలోచనలు ఉన్నాయని మరియు దానిని స్క్రిప్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ ని సాలార్ షూటింగ్ పూర్తి అయ్యాక చాప్టర్ 3 మీద ఫోకస్ పెట్టాలని కోరనున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అందుకు సమయం పడుతుందని చెప్పారు. కాబట్టి, కెజిఫ్ అభిమానులు KGF 3 కోసం మరికొన్ని సంవత్సరాలు వేచిఉండక తప్పదు.

787 views