Devara: దేవర నుంచి లేటెస్ట్ అప్డేట్ ! ఫ్యాన్స్ కి ఇక పండగే…

Posted by venditeravaartha, July 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ గారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.ఇప్పుడు తాను చేస్తున్న సినిమా లు అన్ని కూడా పాన్ ఇండియన్ స్థాయి లోనే రిలీజ్ చేస్తున్నారు.తన 30 వ సినిమా ని కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో తన 31 వ సినిమా ని చేయనున్నారు.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఎన్టీఆర్ 30 వ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా కంఫర్మ్ చేసారు.భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న దేవర సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.

devara

దేవర సినిమా లో ఎన్టీఆర్(NTR) ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం దేవర(Devara) రెండు భాగాలుగా రూపొందనుంది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రీకొడుకుల పాత్రా ల లో చేయనున్నారు .ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ కోసం హీరోయిన్ గా సాయి పల్లవి ని తీసుకున్నారు.ఇక కొడుకు పాత్రా కి హీరోకి గా బాలీవుడ్ బ్యూటీ జాన్హవి కపూర్ ని తీసుకున్న విషయం తెలిసిందే. రెండో భాగంలో ఆయన పాత్ర కీలకం కానుంది. కొరటాల రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసి, షూటింగ్ ప్రారంభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ntr and janhavi

ఈ సినిమా లో ఎన్టీఆర్ కి విల్లన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయినా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్‌లో రావణ్ పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ కూడా దేవర విలన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ ,సైఫ్ అలీ ఖాన్ ల మధ్య వచ్చే సీన్ ల కి థియేటర్ ల లో ఒక రేంజ్ లో సెలెబ్రేషన్స్ ఉంటాయి అంటున్నారు. దేవర పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ మరియు ఎమోషన్స్‌తో రూపొందుతోంది. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్ట్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. దేవర ఏప్రిల్ 5, 2024న పలు భాషల్లో విడుదల కానుంది.

saif ali khan

1789 views