Krishna: 7 సార్లు త్రిపాత్రాభియనం చేసిన ఎకైక హీరో కృష్ణ.. ఆ సినిమాలేవో తెలుసా?

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పుడు స్వర్ణయుగం. ఏడాదికి వందల కొద్దీ సినిమాలు థియేటర్లోకి వచ్చేవి. ఆ సమయంలో టీవీ మానియా ఎక్కువగా లేకపోవడంతో చాలా మంది సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డైరెక్టర్లు, హీరోలు విభిన్న సినిమాలను తీసేవారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు ల తరువాత ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో రికార్డుల సాధించారు. మల్టీకలర్ సినిమా నుంచి మొదలుకొని హాలీవుడ్ స్టైల్లో సినిమాలు తీయడం కృష్ణకే సాధ్యమైంది. హీరోగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు ఆయన నుంచి వచ్చాయి. అయితే కృష్ణ(Krishna) సినిమాలో నటిస్తున్నాడంటే ఒక పాత్రతో సరిపెట్టుకోరు. కనీసం రెండు పాత్రల్లో కనిపిస్తారు. అయితే కొన్ని సినిమాల్లో ఆయన మూడు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. కృష్ణ మరణించి ఏడాది పూర్తయినందున ఆయన జయంతి సందర్భంగీ ఈ స్పెషల్ స్టోరీ మీకోసం..

krishna

కృష్ణ త్రిపాత్రాభినయంగా నటించిన మొట్టమొదటి చిత్రం కుమార రాజా. ఇందులో కృష్ణ తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రల్లో కనిపిస్తారు. కన్నడంలో ‘శంకర్ గురు’ అనే సినిమాను తెలుగులో ‘కుమార రాజా’(Kumar raja) అనే పేరుతో తీశారు. పి. సాంబశివరావు దీనిని తీశారు. ఆ తరువాత ‘డాక్టర్ సినీ యాక్టర్’ అనే సినిమాలో కృష్ణ త్రిబుల్ రోల్స్ చేశారు. తండ్రి, తనయుడు, మేనల్లుడు పాత్రల్లో కృష్ణ నటించారు. మేనమామ పోలికలతో ఉన్న మేనల్లుడు పాత్రలో కృష్ణ నటించారు. ఈ సినిమాకు విజయనిర్మల డైరెక్షన్ చేశారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

doctor cine actor

‘పగబట్టిన సింహం’(Paga pattina simham) అనే సినిమాలోనూ కృష్ణ మూడు పాత్రల్లో కనిపిస్తారు. పి. చంద్రశేకర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఇందులో కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, లాయర్ గా, విలన్ గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్టు కొట్టింది. కృష్ణ నాలుగోసారి త్రిపాత్రాభినయంలో నటించిన మూవీ ‘సిరిపురం మొనగాడు’. దీనిని కేఎస్ఆర్ దాస్ తీశారు. ఇందులో తండ్రి కొడుకులుగా, విలన్ గా నటించారు. ఈ సినిమా కడా సక్సెస్ ను అందుకుంది. తండ్రీ, ఇద్దరు కుమారులుగా కృష్ణ నటించిన మరో చిత్రం ‘బంగారు కాపురం’(Bangaru kapuram). ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీనిని పి. చంద్రశేఖర్ రెడ్డి తీశారు.

pagapattina simham

రక్తసంబంధం సినిమా కృష్ణ కు భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఇందులో తండ్రి, తనయులుగా నటించారు. తమిళంలో ‘దైవమగన్’ అనే సినిమాను రీమేక్ చేసిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తరువాత కృష్ణ త్రిపాత్రాభినయంలో నటించిన మరో మూవీ ‘బొబ్బిలి దొర’. బోయపాటి కామేశ్వర్ రావు డైరెక్షన్లో వచ్చిన ఇందులో కృష్ణ తండ్రి, తనయులుగా నటించారు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

bangaru kapuram

753 views