Kiran abbavaram: అవకాశాలు లేక మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న కిరణ్ అబ్బవరం

Posted by venditeravaartha, June 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న వాళ్ళకి సక్సెస్ చాల త్వరగా వస్తుంది అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran)..ఇంజనీరింగ్ చదివిన కిరణ్ మొదట గా బెంగళూరు లో మంచి జాబ్ చేస్తూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత రాజా వారు రాణి వారు తో సోలో హీరో గా ఎంట్రీ ఇచ్చి పర్లేదు అని అనిపించుకున్నారు.ఇక తానే రైటర్ గా మారి కో ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన SR కల్యాణమండపం తో బ్లాక్ బస్టర్  అందుకున్నారు.కరోనా టైం లో రిలీజ్ అయినా ఈ సినిమా కిరణ్ కెరీర్ కి హెల్ప్ అవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ కి బూస్ట్ ఇచ్చింది.

sr

SR కల్యాణమండపం(SR Kalyanamandapam) మూవీ ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సెబాస్టియన్,సమ్మతమే,నేను మీకు బాగా కావాల్సిన వాడినే అంటూ ఒకే సంవత్సరం లో మూడు సినిమా ల ను రిలీజ్ చేసాడు అయితే అవి ఆశించిన ఫలితాలని ఇవ్వలేదు.ఇక ఈ సంవత్సరం లో రిలీజ్ అయినా వినరో భాగ్యము విష్ణు కథ తో మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని సక్సెస్ బాట పట్టాడు అయితే ఆ తరువాత ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ చేసిన మీటర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

meter

మీటర్(Meter) సినిమా నిరాశపరచడం తో కిరణ్ కెరీర్ కొంచెం రిస్క్ లో ఉన్నట్లు చెప్తున్నారు..తన కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన 7 సినిమా ల లో రెండు మాత్రమే సక్సెస్ కావడం తో ఇప్పుడు తనకి ఒక భారీ కమర్షియల్ హిట్ అవసరం అయింది.ఇది వరకు రెండు ,మూడు సినిమా లు ఒకే టైం లో చేసిన కిరణ్..మీటర్ సినిమా తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి.ప్రస్తుతం తన చేతిలో రూల్స్ రంజాన్(Rules ranjan) అనే సినిమా ఒకటే ఉంది.ఈ మూవీ కూడా మీటర్ కి ముందే కమిట్ అయినా సినిమా.ఇక ఇది వరకే తాను చెప్పినట్లు తనకు సినిమా అంటే ఫ్యాషన్ అని అందుకే 80000 రూపాయల జాబ్ వదులుకుని వచ్చాను అని సినిమా లు ప్లాప్ అయినా అవకాశాలు రాకపోయినా ఇండస్ట్రీ లోనే ఉంటాను అని చెప్పాడు.

rules ranjan

1989 views