Kiraak RP: ఇష్టమైతే తినండి.. లేకపోతే పొండి.. నా రేటింతే.. నేనేం బతిమలాడనంటున్న.. కిర్రాక్ ఆర్పీ

Posted by RR writings, March 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా ఉన్నప్పుడు ఆర్పీ షో నుంచి బయటకు వచ్చారు. తర్వాత నిర్మాతగా మారి సినిమా తీశారు. మళ్లీ హాస్యాన్ని నమ్ముకుని మరో ఛానెల్‌లో కమెడియన్‌గా స్థిరపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ అంటే తనకు ఇష్టమని అందులోని వ్యక్తుల గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. కామెడీ షోలన్నీ పక్కన పెడితే నెల రోజుల క్రితం కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో కర్రీ పాయింట్‌ని తెరిచారు. అనుకోకుండా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వస్తున్న జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు.

ఆర్పీ దాదాపు లక్షల లాభాలు రావడం ప్రారంభించింది. నెల్లూరు నుంచి తాజా చేపలు తెచ్చి బాగా వండడంతో కర్రీ పాయింట్ వద్ద జనం క్యూ కట్టారు. ఇక అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు కుమారి ఆంటీ ఎలాగో అప్పుడు RP కూడా తన షాప్ మూసేయవలసి వచ్చింది. కానీ ఆర్పీ మాత్రం చిన్న దుకాణాన్ని పెద్దది చేసి షాక్ ఇచ్చాడు. హైదరాబాద్‌లో మూడు శాఖలను ప్రారంభించాడు. ఇప్పుడు ఇతర నగరాల్లోనూ బ్రాంచ్‌లు ప్రారంభించి మంచి డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే చేపల పులుసు రుచి సంగతి పక్కన పెడితే ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చిన ఆర్పీ ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

‘ఇప్పుడు నీ ఎదురు క్రెటా ఉంది.. ఆడీ ఉంది.. బెంజ్ ఉంది.. నీకు ఏది నచ్చితే అది తీసుకో.. నీకేంటి సమస్య.. రూ. 300 చేపలు పెట్టా.. ఆ రూ. 300 పెట్టి జనాలు తీసుకోకపోతే లాస్ అయ్యేది ఎవరు.. నేనే కదా.. ఆశపడి ఎక్కువ రేటు పెడితే.. జనాలు కొనకపోతే నష్టం వచ్చేది కూడా నాకే. తక్కువ రేటు పెట్టొచ్చు అని తెలిసినప్పుడు ఎక్కువ రేటు పెట్టి జనాలు రాకపోతే మోసపోయేది ఎవరు.. నేనే కదా.. అది అంతే రేటు.. తింటే తిను.. లేకపోతే పో. రెస్టారెంట్ లో తినేవాళ్లు తింటారు.. రోడ్డుపక్కన తినేవాళ్లు తింటారు. నేను తక్కువలో చేయాలంటే నాసిరకం తీసుకొచ్చి వండమంటే వండుతా.. అన్నాన్ని, రాగి సంకటిని తక్కువలో ఇవ్వగలను కానీ, కోరమీను లాంటి కోరమీనును తక్కువ రేటులో ఇప్పించండి..

అలాగే తక్కువ రేటుకు ఇస్తా.. నా రేట్లు ఇలానే ఉంటాయి. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. మీకు ఎలా పడితే అలా నాసిరకంగా వండి పెట్టడం లేదు. చేపల పులుసుకు వాడే అన్ని పదార్దాలు రేటు ఎక్కువ.. చేపలు రేటు ఎక్కువ, ఆయిల్, మసాలాలు ఇవన్నీ రేట్లు ఎక్కువ అన్నప్పుడు నాకేం చిటికేస్తే రావడం లేదు. ఇవన్నీ కావాలని కొంతమంది గ్రూప్ లు చేస్తున్నాయి. నీకు టేస్ట్ నచ్చితేనే కొను.. రసం లా ఉంటుంది అంటే అదే కొనుక్కొని తిను.. నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చకపోయినా నా చేపల పులుసు తీసుకోవాలని నేను బతిమాలాడను” అంటూ ఆర్పీ చెప్పుకొచ్చాడు.

467 views