2016 లో రిలీజ్ అయినా ‘నేను శైలజ ‘ మూవీ తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టారు ‘కీర్తి సురేష్ ‘, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి మూవీ ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మరిచిపోలేని స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్న కీర్తి సురేష్ , ఆ తర్వాత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి ఓటమి పాలైంది. అయితే వరుస అపజయాలు వచ్చినప్పటికీ ఏమాత్రం దక్కని ఆమె క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది.
నేను శైలజ సినిమాలో సైలెంట్ గా ఉండే పాత్రలో మెప్పించింది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి అందాల అభినయ తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె యాక్టింగ్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.
ఆమె తన సినిమా కెరీర్ ప్రారంభంలోనే మలయాళం, తమిళం వంటి భాషల్లో నటించిన కీర్తి సురేష్ కు ఆ అనుభవం తెలుగులో బాగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. అందుకే మహానటి చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఇలా ఈ ఒక్క సినిమాతో తెలుగులో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అలాగే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.
కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను, లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ఓకే చేసింది.
ఈ క్రమంలోనే మిస్ఇండియా, గుడ్‌లక్‌సఖి, చిన్ని వంటి సినిమాలు చేసింది. అయితే వాటి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. సినిమాలే కాకుండా గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసింది కీర్తి సురేష్. అయితే ఈ పాటతో ఎక్కువగా విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. కీర్తి సురేష్ అకౌంట్లో ఓ హిట్ఉండేలా చేసింది. అయితే ఎప్పుడూ సాంప్రదాయ పద్ధతి లో కనిపించిన కీర్తి సురేష్ ఇందులో కాస్తా గ్లామర్ షో చేసింది.
ఇక పోతే పాన్ ఇండియా స్థాయి లో రాబోతున్న తన ‘ దసరా ‘ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు కీర్తి సురేష్ , అయితే సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ వదిలింది. ఇందులో నల్ల చీర, జాకెట్ వేసుకుని చాలా అందంగా దర్శనం ఇచ్చింది . వివిధ యాంగిల్స్ లో కూర్చోని, నిల్చోని పోజులిచ్చిన బ్యూటిఫుల్ కీర్తి సురేష్ తన ఎద అందాలను ప్రదర్శించింది. చూపించి చూపించనట్లుగా నడుము అందాలను ఆరబోసింది. మెడలోని పెండెంట్ చేత్తో పట్టుకుని కొంటెగా చూస్తున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.