దర్శక ధీరుడు రాజమౌళి గారు తెరకెక్కించిన RRR చిత్రంలోని నాటు నాటు పాట
ఆస్కార్ ని దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి.. తన తమ్ముడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు రిలీజ్ అయినా,12 చిత్రాలకు సంగీతం అందించారు. కానీ ఈయన కంటే ముందు జక్కన్న గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంంలోనే ఎక్కువ సినిమాలకు సంగీతం అందించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్‌లో హీరో, డైరెక్టర్‌తో పాటు.. హీరో, మ్యూజిక్ డైరెక్టర్.. మరోవైపు దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబినేషన్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి సూపర్ క్రేజీ కాంబినేషన్స్‌లో దర్శకుడు కే.రాఘవేంద్రరావు, కీరవాణికి ప్రత్యేక అనుబంధం ఉంది. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన 20 సినిమా ల లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా 10 చిత్రాలు ఏంటో చూద్దాం.
1 .ఘరానా మొగుడు
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 2 వ చిత్రం ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం అప్పట్లో 10 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా గ అవతరించింది, చితరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టైయింది.
2 . అల్లరి మొగుడు
కీరవాణి ,రాఘవేంద్ర రావు గార్ల కలయిక లో వచ్చిన మొదటి చిత్రం ‘అల్లరి మొగుడు’,
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మీనా హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ నిలిచింది.
3 .మేజర్ చంద్ర కాంత్
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 5వ చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది, ఈ సినిమా 100 రోజుల వేడుక తిరుపతి లో అట్ట ఆహాసం గా జరిగింది.
4 .సుందరకాండ
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 3వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్, మీనా హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
5 .అల్లరి ప్రియుడు
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 4వ చిత్రం ‘అల్లరి ప్రియుడు’. రాజశేఖర్, మధుబాల, రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
అప్పట్లో ఈ సినిమా లోని పాటలు ఒక సెన్సషనల్.
6 .పెళ్లి సందడి
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 9 చిత్రం పెళ్లి సందడి.
తక్కువ బడ్జెట్ లో తీసిన మంచి ఫ్యామిలీ సినిమా ఇది. శ్రీకాంత్, రవళి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
7 .గంగోత్రి
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 14వ చిత్రం గంగోత్రి. రాఘవేంద్ర రావు గారికి ఈ సినిమా 100 వ సినిమా , అల్లు అర్జున్ హీరోగా తొలి చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించింది.అశ్వినీదత్ గారికి ట్రిపుల్ ప్రాఫిట్స్ తెచ్చిన చిత్రం గా అయన చాల ఇంటర్వూస్ లో చెప్పి ఉన్నారు.
8 .అన్నమయ్య
రాఘవేంద్ర రావు ,కీరవాణి కలయికలో వచ్చిన 10వ చిత్రం అన్నమయ్య.
అప్పటి వరకు రొమాంటిక్ పాత్రలు చేస్తున్న నాగార్జున గారు అన్నమయ్య పాత్రా చేయగా , సుమన్, మోహన్ బాబు, రమ్యకృష్ణ,భానుప్రియ,రోజా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో కీరవాణి నంది అవార్డుతో పాటు జాతీయ అవార్డును కూడా అందుకోవడం విశేషం. నాగార్జున గారికి కూడా నంది అవార్డు వచ్చింది.
9 .బొంబాయి ప్రియుడు
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 11వ చిత్రం ‘బొంబాయి ప్రియుడు’. చక్రవర్తి, రంభ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సూపర్ హిట్ ని నమోదు చేసింది.
10 .శ్రీ రామదాసు
కే.రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన 16వ చిత్రం శ్రీరామదాసు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, స్నేహ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ చిత్రం కి నాగార్జున గారికి నంది అవార్డు కూడా వచ్చింది.
.