Karthika Deepam2 April 11 Episode 16 : దీప శౌర్యను లోపలికి తీసుకువస్తుంది. అందరి ముందు బట్టలు లేవని ఎందుకు చెప్పావు అని గొడవ పడుతుంది .దాంతో సౌర్య కోపంగా ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఒక పేపర్ మీద రాసి ఇవ్వు అలానే మాట్లాడతాను అని అంటుంది. నాకు ఏం మాట్లాడాలో చెప్తావు కానీ నాన్న ఎక్కడున్నాడు అంటే మాత్రం చెప్పవు అని అడుగుతుంది. దాంతో దీప ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది సౌర్య కి ఏం చెప్పాలని అనుకుంటుంది ఇక సౌర్య, సార్ ని చూడమ్మా ఆయనకి అమ్మా,నాన్న తాతయ్య, అమ్మమ్మ ఇలా అందరూ ఉన్నారు మరి మనకు ఎవరు ఉన్నారు అని అడుగుతుంది. మనకి కూడా అంతమంది ఉంటే ఎంత బాగుంటుందో కదా పండక్కు నాన్న వస్తాడా రాడా అమ్మా అని అడుగుతుంది. రావడం మా ఈ పండుగ అయిపోయిన తర్వాత మనమే ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్తుంది. ఇక దీపా సౌరకి నచ్చచెప్పి, నాన్న గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుంది ఇక ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్ళాలి అనుకుంటారు.
ఇక సౌర్య దీపా ఇద్దరు బట్టలు కొనడానికి వెళ్తారు అక్కడ డబ్బులు చూస్తే సరిపోయేటట్టు ఉండవు. దీపం ఒక డ్రెస్ చూసి బాగుంది అనుకుంటుంది శౌర్య కూడా ఆ డ్రెస్ చూసి చాలా బాగుంది అని అనుకుంటే కానీ అక్కడ మాత్రం డబ్బులు సరిపోవు దాంతో వేరే షాప్ కి వెళ్దాము అనుకుంటుంది. అంతలో శౌర్య డ్రెస్ నాకు చాలా నచ్చిందమ్మా అని అంటుంది. షాపు వాడిని తగ్గించమని అడుగుతుంది దీప కానీ బట్టలు అమ్మే వ్యక్తి తగ్గించను అని చెప్తాడు. అదంతా కార్తీక్ దూరం నుండి చూస్తూ ఉంటాడు దీప బేరం ఆడుతుంటే అతను పొగరుగా సమాధానం చెప్తాడు. వెంటనే సౌర్య చేతిలో ఉన్న గౌన్ కూడా లాగేసుకుంటాడు. డబ్బులు మీ దగ్గర లేవు కానీ బేరాలు మాత్రం బానే ఆడతారు అని నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు వెంటనే సౌర్య కి కోపం వస్తుంది మా అమ్మని ఏమైనా అంటే రాయితో కొడతాను అని అంటుంది కార్తీక్ వచ్చి సౌర్య ఆపుతాడు. అదేంటి ఆయనతో అలా మాట్లాడతావు అని అంటాడు మా అమ్మని ఎవరైనా అంటే నిజంగా కొడతాను అని అంటుంది. అవును కొట్టేస్తావు నువ్వు పెద్ద రౌడీ అని అంటాడు.సరే మనం వేరే షాప్ కి వెళ్దాం అని అంటాడు కార్తీక్. వాళ్ళను తనతో పాటు రమ్మని పిలిస్తే దీప మాత్రమే నేను రాను అని చెప్తుంది. నాకు మీతో రావాల్సిన అవసరం లేదు అని అంటుంది.ఇదేదో నేను మీ కొనిపెడదామని రమ్మనట్లేదు మా అత్త మిమ్మల్ని తీసుకొని షాప్ కి వెళ్ళమని అందుకే వచ్చాను అని అంటాడు. అయినా దీప మాత్రం కదలదు ఇక దగ్గరలో వేరే షాప్ ఒకటి ఉంది అందులో చాలా తక్కువ రేటుకే బట్టలు వస్తాయి ఆ షాపింగ్ మాల్ కి మనం వెళ్దాము అని అంటాడు. నిజంగానే ఆ షాప్ లో తక్కువ రేట్ కి బట్టలు వస్తాయంట అమ్మ వెళ్దాము అని దీప ను ఒప్పిస్తుంది శౌర్య.
ఇక మరోవైపు బయటికి వచ్చినా దీప శౌర్య ఇద్దరు ఆటో కోసం నించుంటారు కానీ ఆటో రాదు నా కారులో ఎక్కండి అని కార్తీక్ అడుగుతాడు కానీ వాళ్ళు మాత్రం కారు ఎక్కరు ఇక ఆటోనే అనుకొని నా కారు ఎక్కండి అని అడుగుతాడు. సౌర్యా అను దీపను షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకువెళ్తారు అంత పెద్ద షాపింగ్ మాల్ చూసి ఇద్దరు నూరేళ్ల పెడతారు ఇంత పెద్ద షాప్ లో తక్కువకి బట్టలు ఎలా వస్తాయి అంటే మీరు మమ్మల్ని అవమానించాలి అనుకుంటున్నారా బాబు అని దీప అంటుంది కార్తీక్ మాత్రం కాదు ఇది నేను నిజమే చెప్తున్నాను కావాలంటే మీరు లోపలికి వెళ్లి చూడండి అని అంటాడు. కార్తీక్ నచ్చచెప్పి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తాడు బట్టల షాపు మా ఊరంతా పెద్దదిగా ఉందే అని శౌర్య అంటుంది కార్తీక్ ను షాపులో ఒకచోట ఆపి మీరు ఇక్కడే ఉండండి మా రేంజ్ గౌన్లు మేము తీసుకుంటాం మళ్ళీ మీరు వస్తే మీరు మాకు బట్టలు కొనిపెడతారు అని అంటుంది ఇక కార్తీక్ సరే అయితే మీరే వెళ్లి కొనుక్కోండి షాప్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి డిస్కౌంట్ ఉందని చెప్పండి బిల్లు నేనే కడతాను ఆ విషయం దీపకు మాత్రం చెప్పొద్దు అని అంటాడు. ఇక ఒక గౌను చూసి రేటెం ఎక్కువగా ఉంటుందని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. షాపు వాడు చూసి రేటు ఎక్కువ కాదండి తక్కువ డిస్కౌంట్ లో ఇది మీకు చాలా తక్కువగా వస్తుంది అని చెప్పి ఇస్తాడు ఇక వెంటనే దీప ని కూడా చీర కొనుక్కోమని చెప్తాడు షాపు లో ఉన్న వ్యక్తి కానీ దీపా డబ్బులు సరిపోవేమోనని ఆలోచిస్తూ ఉంటుంది లేదు మేడం చాలా తక్కువగా చీరలు కూడా ఉన్నాయి మా దగ్గర డిస్కౌంట్ లో వస్తాయి అని చూపిస్తాడు అదంతా కార్తికే ప్లాన్ చేసి ఉంటాడు ఇక మనసులో కార్తీక్ నేను నీకు ఏదో సహాయం చేయడానికి ఇదంతా చేయట్లేదు నువ్వు కొంతైనా సంతోష పడతావని ఇలా చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు .
ఇక సౌర్య తల్లిని ఒప్పించి బలవంతంగా చీర కొనుక్కునిలా చేస్తుంది. ఇక కార్తీక్ వాళ్ళని చూసి నువ్వు నన్ను క్షమించలేదని బాధ కంటే నీ పరిస్థితి చూస్తుంటే నాకు ఇంకా బాధగా ఉంది అని మనసులో అనుకుంటాడు. బట్టలు కొనుక్కొని కార్తీక్ దగ్గరికి వచ్చిన సౌర్యా సర్ మీకు చాలా థాంక్స్ అని ఉంటుంది ఇక నువ్వు నన్ను సార్ అని పిలవక్కర్లేదు నువ్వు నన్ను కార్తీక్ అని పిలువు అంటాడు.పెద్దవాళ్లని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా అంటుంది ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారు నేను నీ ఫ్రెండ్నే కదా పిలవచ్చు పర్లేదు అని అంటాడు. ఇక ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మరి మీరు నన్ను ఏమని పిలుస్తారు అని అడుగుతుంది ఇందాకే నీ రౌడీయిజం చూశాను కదా నేను రౌడీ అని పిలుస్తాను లే అని అంటాడు. ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు
దీప వాళ్ళని తీసుకొని కార్తీక్ బయటికి వస్తూ ఉంటే అప్పుడే నరసింహం ఎదురుపడతాడు కానీ దీపమాత్రం నరిదిహాన్ని చూడదు ఇది ఊరికి వెళ్ళిపోయింది అనుకున్నాను ఇక్కడే ఉంది ఏంటి అసలు ఎవరితో తిరుగుతుంది ఇంతకీ వీడు ని తీసుకొని ఇక్కడికి వచ్చి బట్టలు కొనిపెడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతారు. నరసింహం దీప వెనకాల దీప దీపాన్ని పరిగెడతాడు అప్పటికే కార్తీక్ కారు ను స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు.