NTR: కొడాలి నాని తో కలిసి ఆ స్టార్ నిర్మాత ని రూమ్ లో నిర్బంధించి చితక్కొట్టిన జూనియర్ ఎన్టీఆర్?

Posted by venditeravaartha, July 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

NTR: ఇండస్ట్రీ లో కొంతమంది నమ్మకం గా ఉండేవారు ఉంటారు, కొంతమంది సమయం చూసి తమ యజమాని కి పంగనామం పెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటోళ్లని గుర్తించక కొంతమంది స్టార్ హీరోలు ఎంతో డబ్బుని నష్టపోతుండడం మనమంతా గతం లో మనం ఎన్నో ఉదాహరణలు చూసాము. మహానటి చిత్రాన్ని ఒకసారి వీక్షిస్తే సావిత్రి దగ్గర పని చేసే అసిస్టెంట్ ఆమె దగ్గర ఎంతో డబ్బులను నొక్కేసి, ఆమె దయనీయమైన పరిస్థితికి వచ్చినప్పుడు, ఆ అసిస్టెంట్ పెద్ద స్థాయిలో కనపడతాడు. ఈ సన్నివేశం చూసినప్పుడు ప్రతీ ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. అలాంటి సంఘటనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితం లో కూడా చోటు చేసుకుందట.

కెరీర్ ప్రారంభం లో జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గర పనిచేసే మ్యానేజర్ ని బాగా నమ్మేవాడు అట. ఎన్టీఆర్ కి సంబంధించిన రెమ్యూనరేషన్ చెక్స్, డేట్స్ దగ్గర నుండి ప్రతీ ఒక్కటి అతనే మ్యానేజ్ చేస్తూ వచ్చేవాడట. అంత డబ్బు రొటేషన్ చూసే లోపు ఎన్టీఆర్ మ్యానేజర్ కి దురాశ కలిగింది. ఒక సినిమాకి రావాల్సిన రెమ్యూనరేషన్ విషయం లో ఎన్టీఆర్ ని మోసగించి డబ్బులు కాజేసి పారిపోయాడట ఆ మ్యానేజర్. ఎన్టీఆర్ కి ఇంకా రెమ్యూనరేషన్ అందకపోవడం తో సినిమా విడుదలై ఇన్ని రోజులు పూర్తి అయ్యింది, ఇంకా రెమ్యూనరేషన్ రాలేదేంటి అని నిర్మాతకి ఫోన్ చేసి అడిగాడట.

అప్పుడు నిర్మాత అదేంటి బాబు సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పగానే రెమ్యూనరేషన్ ఇచ్చేసాను కదా అని అన్నాడట. నాకు రెమ్యూనరేషన్ ఎప్పుడిచ్చారు, తమాషాలుగా ఉందా అని ఎన్టీఆర్ ఆ నిర్మాతపై సీరియస్ అయ్యాడట. ఆ తర్వాత ఆ నిర్మాత ఎన్టీఆర్ ఇంటికి వచ్చి, ఆయనకీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టుగా లెక్కలతో సహా ఆధారాలు చూపించాడట. దీంతో మ్యానేజర్ మీద అనుమానం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతనికి ఫోన్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వచ్చిందట. 10 రోజులకు ముందే ఆయన ఎన్టీఆర్ వద్ద లీవ్ పెట్టి ఉన్నాడు.

అయితే ఈ విషయం తెలుసుకొని ఆ మ్యానేజర్ ని సంప్రదించేందుకు ఎన్టీఆర్ ఎంత ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదట. దీంతో తన ప్రాణ మిత్రుడైన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో తన మ్యానేజర్ ని పట్టుకొని, తనని ఇంత మోసం చేసినందుకు ఎన్టీఆర్ ఆ మ్యానేజర్ ని ఒక రూమ్ లో నిర్బంధించి చితకబాదాడట. మరోసారి ఎవ్వరి విషయంలోనైనా ఇలాంటి మోసం చెయ్యాలంటే వెన్నులో వణుకు వచ్చేలాగా ఎన్టీఆర్ చేసాడట. ఈ సంఘటన తో ఆ మ్యానేజర్ కి సినీ కెరీర్ లేకుండా పోయింది.

299 views