మొదట్లో టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన జోగి నాయుడు తర్వాత నటుడి గా మారారు ,స్వామి రారా ,కుమారి 21f ,నువ్విలా నేనిలా ,గుంటూరు టాకీస్ వంటి పలు చిత్రాల ఓ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సినిమా ల లో అవకాశాలు తగ్గుమొకం పడుతున్న సమయం లో వైస్సార్సీపీ పార్టీ లో చేరి జగన్ పాదయాత్ర లో చురుగ్గా పాల్గొన జోగి నాయుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆయన ను ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించింది. జోగి నాయుడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత ఆమె నుంచి విడిపోయాడు. ఝాన్సీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనితో ఉండటానికి అంగీకరించలేదు మరియు ఆమెతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా జోగి నాయుడు ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
నా కెరీర్ స్టార్టింగ్ లో జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను ,ఆ సమయం లోనే నాకు ఝాన్సీ తొలిసారిగా పరిచయమైంది, ఆ పరిచయం కాస్త ప్రేమ గా చిగురించింది. మేమిద్దరం కలిసి గడిపిన జ్ఞాపకాలను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న . నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాను, ఆమె యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. మేము దాదాపు తొమ్మిదేళ్లు కలిసి ఉన్నాము. అయితే ఇద్దరూ మంచి గా సెటల్ అయ్యి ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. దాని వలనే ఏడాదిలోపే విడిపోవాల్సి వచ్చింది. అప్పటికి మాకు ఒక కూతురు ఉంది ఆమె పేరు ధన్య.మేము విడిపోయాము అని తెలుసుకున్న బ్రహ్మానందం గారు తండ్రి స్థానం లో నిలబడి మమల్ని కలపడానికి చాల ప్రయత్నం చేసారు.చిరంజీవి గారు కూడా ఇద్దర్ని కూర్చుని పెట్టుకుని దాదాపు 3 గంటలు సేపు మాట్లాడారు కలపడానికి. కానీ వర్కవుట్ కాలేదు.
నాకు ఝాన్సీ అంటే చాల ఇష్టం అప్పుడు తెలియక అప్పుడు ఉన్న పరిస్థితుల లో విడిపోవాలి అని నిర్ణయించుకున్నాం కానీ తర్వాత నేను ఎంత గానో తనని బ్రతిమాలాడాను కలిసి ఉందాం అని కానీ దానికి ఆమె అంగీకరించలేదు ,ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక వారికి వచ్చే విభేదాల వలన వారి పిల్లలు ఇబ్బంది పడకూడదు కదా,ప్రతి వారం నేను వారానికి ఒకసారి అయినా నా బిడ్డను చూసేవాడిని,ఆ సమయం లో కూడా ఝాన్సీ నన్ను నా కూతుర్ని కలవడానికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం నాకు నచ్చేది కాదు.ఆ తర్వాత మేము ఇంకా కలవడం అసాధ్యం అని తెలిసాక రెండో పెళ్లి చేసుకున్నాను.
మొదటి పెళ్లి నాకోసం చేసుకున్నాను రెండో పెళ్లి మా అమ్మ గారికి కోసం మాత్రమే చేసుకున్నాను అని చెప్పారు.నా కూతురు చిన్నతనంలో తల్లి దగ్గర, పెద్దయ్యాక నాన్నతో కలిసి జీవించాలని కోర్టు చెప్పింది. అందుకే ఆమె తన తల్లి దగ్గరే పెరిగింది. వారానికోసారి పంపారు. పేగు బంధాన్ని ప్రదక్షిణగా తీసుకురావడం అన్యాయమనిపించింది.నా కూతురు ఎప్పుడూ నా దగ్గరకు వస్తుందని అనుకున్నాను. అది జరగలేదు. అందుకే దేవుడు కరుణించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చి ఇద్దరు ఆడపిల్లలను ఇచ్చాడు. వారిలో నా ఆశీర్వాదం కోసం చూస్తున్నా అంటూ జోగి నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.మనం ఎంత అవతల వారిని ప్రేమిస్తామో ఆ ప్రేమ ని పక్కా వారు కూడా చూపిస్తేనే ఆ బంధం చిరకాలం ఉంటుంది లేకపోతే వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.