Janhvi Kapoor:తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ‘జాన్వీ కపూర్ ‘

Posted by venditeravaartha, April 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోయిన్ లు వచ్చిన అతిలోక సుందరి ‘శ్రీ దేవి ‘ గారికి ఉన్న గుర్తింపు అంత ఇంత కాదు ,భారత దేశం లో ఉన్న అన్ని మేజర్ భాషల లో నటించిన శ్రీదేవి ,బాలీవుడ్ నిర్మాత అయినా ‘బోనీ కపూర్ ‘ ని వివాహం చేసుకుని సినిమా ల నుంచి బ్రేక్ తీసుకున్నారు.చాల గ్యాప్ తరువాత ఒకటి ,రెండు సినిమా ల లో నటించిన శ్రీ దేవి 2018 లో మరణించారు.శ్రీ దేవి గారికి ఇద్దరు కూతురు లు ఉన్నారు.

శ్రీదేవి మొదటి కూతురు అయినా జాన్వీ కపూర్ ధఢక్ సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఇక ఈ అమ్మడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో రాణిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే బాలీవుడ్ లో వచ్చిన గుర్తింపు తో తెలుగులో తన మొదటి సినిమా చేస్తోంది.బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందుతోన్న జాన్వీకపూర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.

తాజాగా జాన్వీ కపూర్ తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలు తెలిపింది. నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తనకు కాబోయేవాడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, నన్ను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి, అన్నికంటే ముఖ్యం మా నాన్న కంటే హైట్ ఉండే వ్యక్తి కావాలని ఆమె అన్నారు.మరి తనకి కావాల్సిన వ్యక్తి ఆల్రెడీ ఉన్నారా లేక వెతికే పని లో ఉన్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది.ఎన్టీఆర్ 30 తో సౌత్ లో టాప్ హీరోయిన్ అవుతారు అని కొందరు అంటున్నారు .

387 views