Janasena: సోమవారం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసి, పదిమందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. మొదటి జాబితా వదిలినట్టే రెండవ జాబితా కూడా మంచి రోజు చూసి రిలీజ్ చేస్తారని సమాచారం ఇందులో కొన్ని తెలుగుదేశం పేర్లు కొన్ని జనసేన వాళ్ళ పేర్లు కలిపి ప్రకటిస్తారా లేక జనసేన పేర్లు మాత్రమే ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తెలుగుదేశం బిజెపితో కలుస్తుందని ఆలోచనలో ఉంది కాబట్టి ఇక రెండవ జాబితా తెలుగుదేశం ఇప్పుడే ప్రకటించడం లేదని సమాచారం. మొత్తం 57 సీట్లలో తెలుగుదేశం ఎన్ని సీట్లు ప్రకటిస్తుందో తెలియదు కానీ జనసేన మాత్రం ప్రకటించిన 24 సీట్లలో, మొదటి ఐదు పేర్లు ప్రకటించారు ఇక మిగిలినవి ప్రకటించాల్సి ఉంది.
ఇక జనసేన మొదట ప్రకటించిన ఐదు పేర్లు, నెలిమర్ల లోకం మాధవి, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ తెనాలి నాదెండ్ల మనోహర్. ఈ ఐదు స్థానాలను మొదటి జాబితా లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఇక రెండవ లిస్టులో 19 మందిని రిలీజ్ చేయాల్సి ఉండగా మొదట ఒక పదిమంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.ఇప్పుడు ఆ పది స్థానాలు ఏమిటో చూద్దాం.
విజయవాడ వెస్ట్ నుంచి, పోతిన మహేష్ ని ఖరారు చేసినట్లు సమాచారం.నర్సాపురం నుండి బొమ్మిడి నాయకర్ ని ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన పోయినసారి జరిగిన ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించారు. జనసేనకు వచ్చిన ఓట్లలో ఎక్కువ ఓట్లు వచ్చింది ఈయనకే, కావడం విశేషం.రాజోలు -బొంతు రాజేశ్వరరావు ఈయన రిటైర్ ఆఫీసర్ అనుభవంతో విద్యావంతుడు కావడంతో వైసీపీలో కొంతకాలం పనిచేసి రెండు సంవత్సరాల క్రితమే జనసేనలో చేరారు ఈయనకి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.
మచిలీపట్నం రూరల్ లో అవనిగడ్డ నుండి మదివాడ వెంకట రామకృష్ణ ఈయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్
నిడదవోలు కందుల లోకేష్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.గుంటూరు వెస్ట్ నుండి వునబోయిన శ్రీనివాస్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. గుంటూరులోనే తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నట్లు తెలిసింది ఇక సత్తెనపల్లి సీటుని ఆశించిన అక్కడినుండి తెలుగుదేశం పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ ఉండడంతో ఇక గుంటూరు వెస్ట్ కి జనసేన శ్రీనివాసులు ప్రకటించే అవకాశం ఉంది.
భీమవరం నుండి రామాంజనేయులు పేరు ఖరారు చేస్తారని సమాచారం ఎందుకంటే ఈయన తెలుగుదేశంలో ప్రస్తుతం ఉన్నాడు ఇక జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున ఈయన పోటీ చేసే అవకాశం ఉంది.చీరాల నుండి ఆమంచి స్వాములు పేరును ఖరారు చేస్తున్నట్లు సమాచారం.భీమవరం తెలుగుదేశం పార్టీకి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని లేదంటే తాడేపల్లిగూడెం నుంచి అయినా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.