వైసీపీ శ్రేణులకు తోట నరసింహం విజ్నప్తి

Posted by venditeravaartha, April 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు,జెడ్పీటీసీ,ఎంపీపీ,గ్రామ పార్టీ అధ్యక్షులు,సర్పంచ్ లకు,ఎంపీటీసీ సభ్యులకు,కన్వీనర్లకు,బూత్ సభ్యులకు,సోషల్ మీడియా మిత్రులకు
న‌మ‌స్కారం తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలవల్ల, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు, వాలంటీర్ల ద్వారా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి వద్ద ఇవ్వలేకపోతున్నందున… ఈరోజు (03.04.2024) నుండి అవ్వాతాతల, వికలాంగుల, ఒంటరి మహిళల పింఛన్లను సంబంధిత గ్రామ/ వార్డు సచివాలయం వద్ద అందజేయడం జరుగుతుంది.

కావున, మీ పరిధిలోని అన్ని సచివాలయాల వద్ద మన పార్టీ స్థానిక నాయకులను, కార్యకర్తలను అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు… పింఛన్లను తీసుకోవడానికి వచ్చిన వారికి మంచినీరు, మజ్జిగ ఇతరత్రా కనీస ఏర్పాట్లను చేసి, వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవలసిందిగా మిమ్ములను కోరుతున్నాము.

Tags :
407 views