Jyothula Chantibabu: ఆంధ్రప్రదేశ్ సీట్ల మార్పు అధికార పార్టీ కి తలపోటుగానే మారింది అని చెప్పలి జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుకు ఈసారి వైసీపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయన ఆ పార్టీ నేతలతో చర్చించారట. కాగా, 2009, 2014లో టీడీపీ నుంచి ఓడిపోయిన చంటిబాబు.. 2019లో వైసీపీలో చేరి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ తోట నరసింహానికి YCP జగ్గంపేట టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 5 న లేదా 6 న వైసీపీ నుంచి టీడీపీ లో జాయిన్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అధికారపార్టీ వచ్చే ఎన్నికల్లో టికెట్ విష్యంలో చాల చోట్ల మార్పులు చేస్తూ వస్తుంది దానికి అనుగుణంగానే కాకినాడ పార్లమెంట్ కు సంబంధించి పిఠాపురం జగ్గంపేట ప్రత్తిపాడు లో ఇంచార్జి మార్చాలని పార్టీ చూస్తుంది అని సమాచారం.
ముద్రగడ రాకకోసం ఆ నియోజకవర్గ ఇంచార్జి త్యాగం చేయకతప్పదా అంటే అవును అనే చెప్పాలి ముద్రగడ తొలుత పిఠాపురం నుంచి పోటీచేయాలని చుసిన అయన కుమారుడు పెద్దాపురం నుంచి ఆసక్తి కనబరచడం తో రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని చూస్తున్నారు వైసీపీ కి వచ్చే ఎన్నికలు చాల కీలకం అని పార్టీ చూస్తుంది అని అంటున్నారు పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఇంచార్జి గా బాధ్యతలు వహిస్తున్న దవులూరి దొరబాబు కు వైసీపీ స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.