నియోజకవర్గ ఉపాధ్యాయ క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

Posted by venditeravaartha, September 22, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 22: స్థానిక గుర్రంపాలెం రోడ్ లో బాలాజీ రైస్ మిల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో ఆదివారం యుటిఎఫ్ కాకినాడ జిల్లా కార్యదర్శి పరాల వీర వెంకట సత్యనారాయణ (పి వీ) మాస్టర్ ఎస్ వీరబాబు ఆధ్వర్యంలో టీచర్స్ ఒలింపిక్స్ లో భాగంగా నియోజకవర్గస్థాయిలో ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై వికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించి క్రీడా స్ఫూర్తి చాటుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో ,తెలుగుదేశం నాయకులు మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, అడబా ల వెంకటేశ్వరరావు, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, మారిశెట్టి రాధా, దేవరపల్లి మూర్తి, దాపర్తి సీతారామయ్య, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :
42 views