Janhvi Kapoor: దేవరలో జాహ్నవి కపూర్ కు నిరాశేనా?

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో లేటెస్ట్ గా ఓ మూవీ మేకింగ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇటీవలే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే ఇందులో ఎన్టీఆర్ డిఫరెంట్ గా కనిపించడంతో మూవీపై భారీ అంచనాలు వేసుకుంటున్నారు. చేతిలో కత్తి పట్టుకొని బ్లాక్ డ్రెస్ లో మాస్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ను చూసి అభిమానులు పిదా అయ్యారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మొట్టమొదటిసారిగా యంగ్ టైగర్ పక్కన నటిస్తూ అడుగుపెడుతున్న ఈ భామ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే లేటెస్ట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా జాహ్నవికి నిరాశే మిగులుస్తుందా అని చర్చించుకుంటున్నారు.

Janhvi-Kapoors-Role-In-NTR-Devara-Revealed

వరుస హిట్ల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. అయితే చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి తీసిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరో బ్లాక్ పాస్టర్ మూవీ కొట్టాలననే ఊపు మీదున్నాడు. దీంతో వీరిద్దరికీ ఈ సినిమా కీలకంగా మారనుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో నటిస్తున్న అందాల భామ జాహ్నవి గురించి ఓ న్యూస్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్రలో , కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. అయితే జాహ్నవి తండ్రి పాత్ర పక్కన కనిపించనుందా? లేదా కొడుకు పాత్రతో నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్ర ఎక్కువ నిడివి ఉంటుందట. ఒకవేళ జాహ్నవి కొడుకు పాత్ర పక్కన నటిస్తే ఈ భామ కొద్దిసేపు మాత్రమే సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న జాహ్నవి ఆశలు ఆవిరి అవుతాయా? అని ఆడియన్స్ చర్చించుకుంటున్నారు.

Janhvi-Kapoors-Role-In-NTR-Devara-Revealed
మరోవైపు దేవర సినిమా కథ గురించి రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. సముద్రపు ఒడ్డున ఉండే కొందరి పేదలకు అండగా ఉండే ఒక వ్యక్తి.. వారిని కొందరు దుర్మార్గుల నుంచి నుంచి కాపాడే వ్యక్తిగా దేవర పాత్ర ఉంటుందని తెలుస్తుంది. కానీ కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిని కొట్టిపారిస్తున్నారు. మరి నెట్టింట్లో వస్తున్న ఈ సమాచారం ప్రకారంగానే కథ ఉంటుందా? లేక వేరేలా ఉంటుందా? అనేది తెరపై చూస్తే గాని తెలియదు.

694 views