సినీ ఇండస్ట్రీలోకి రావడం వల్ల తక్కవ టైంలో నే ఫేమస్ కావొచ్చు.. కానీ ఇదే సమయంలో కొన్ని రూమర్స్ లో చిక్కుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లు పరిశ్రమలోని కొందరితో చనువుగా ఉండడంతో వారి మధ్య ఎఫైర్స్ సృష్టిస్తారు. వీటిలోకొన్ని నిజం కావొచ్చు. మరికొన్ని ఫేక్ కావొచ్చు. లేటేస్టుగా ఓ స్టార్ హీరోయిన్ గురించి మాత్రం ఓ రూమర్ క్రియేట్ అయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అయితే సినిమాల్లో నటించే సమయంలోనే ఓ హీరోతో లవ్ లో పడిందట. కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారట. ఆ తరువాత వ్యాపార వేత్తను ప్రేమించిన ఆమె ఆయననే పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా హీరో?
లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్(Kajal).. ఆ తరువాత చందమామ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయింది. మగధీర సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన తరువాత కాజల్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లోకి వెళ్లింది. అయితే సినిమాలో నటించినంత కాలం ఎంతో హుషారుగా ఉన్న కాజల్ ఓ సందర్భంలో తీవ్ర నిరాశకు చెందిందట. అందుకు కారణం లవ్లో ఫెయిల్ అవడమేనని అంటున్నారు.
కాజల్ అగర్వాల్ దాదాపు అందరు హీరోలతో నటించింది. ఇందులో భాగంగా రామ్ పోతినేని(Ram pothineni) తో కలిసి ‘గణేష్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్టు కొట్టకపోయినా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య లవ్ ఏర్పడిందట. అయితే మొదట కాజల్ అగర్వాలే హీరో రామ్ పై మనసు పారేసుకుందట. సినిమా పూర్తయిన తరువాత కొన్ని సార్లు వీరు కాఫీ షాపుల్లోకి వెళ్లేవారట. అయితే ఆ తరువాత కాజల్ తన లవ్ విషయాన్ని రామ్ తో చెప్పినా పెద్దగా పట్టించుకోలేదట. దీంతో అతనికి దూరమైందని అంటున్నారు.
ఆ తరువాత గౌతమ్ కిచ్లూ(Gautham kichulu) అనే వ్యాపార వేత్తతో లవ్లో పడింది. వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యపీగా ఉన్నారు. కాజల్ పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆమె గురించి ఈ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా కాజల్ పై వచ్చిన ఈ రూమర్ నిజమేనా? లేదా ఎవరైనా ఆకతాయిలు సృష్టించారా? అనేది తెలియాల్సి ఉంది.