IPL2023:విరాట్ కోహ్లీ ,గంభీర్ ల మధ్య గొడవ ,కోట్ల రూపాయల ఫైన్ !

Posted by venditeravaartha, May 2, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో జరుగుతున్న ప్రతి మ్యాచ్ కూడా క్రికెట్ అభిమానులని ప్రతి క్షణం ఉత్కంఠత తో అలరిస్తుంది అనడం లో సందేహమేమీ లేదు.అయితే ప్రతి మ్యాచ్ లోను విజేత ఎవరు అని కనిపెట్టలేని విధముగా జరుగుతున్న ఈ సీజన్లో కొన్ని వండర్స్ కూడా చూసాము.సాధారణం గా రెండు ఇంటర్నేషనల్ టీం లు తలపడుతున్నపుడు సహజంగానే పోటీ అనేది ఉంటుంది.ఆట మంచి పొజిషన్ లో ఉన్నపుడు ఇరు జట్ల లోని ప్లేయర్స్ మధ్య మాటల తో వాగ్వాదం జరుగుతాయి.అది ఒకరకంగా గేమ్ లో భాగమే అయినప్పటికీ మితిమీరిన మాటలు ,గొడవ లు క్రికెట్ ఫీల్డ్ లో నిషేధం.ఇంటర్నేషనల్ మ్యాచ్ ల నుంచి ఇప్పుడు ఈ గొడవ లు IPL ని చుట్టూ ముట్టాయి.అవి ఏ ఇద్దరి చిన్న ప్లేయర్స్ మధ్య జరిగిన పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఉండదు,కానీ 2011 వరల్డ్ కప్ విన్నెర్స్ లో భాగమైన విరాట్ కోహ్లీ,గౌతమ్ గంభీర్ ల మధ్య జరగడం తో బీసీసీఐ దీని మీద బాగా సీరియస్ అయింది.

మే 1 నా జరిగిన LSG VS RCB మ్యాచ్ లో హై డ్రామా చోటు చేసుకుంది,మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్స్ అందరు కరచాలనం చేసుకునే సమయం లో బౌలర్ నవీన్ ఉల్ హాక్ ,విరాట్ కోహ్లీ మధ్య గొడవ చోటు చేసుకుంది.గొడవ జరుగుతున్న సమయం లో గ్లేన్ మాక్స్వెల్ వచ్చి గొడవ పెద్దది కాకుండా ఆపే ప్రయత్నం చేసారు.ఆ తర్వాత LSG బ్యాట్సమెన్ ‘కైల్ మేర్స్’ తో విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న సమయం లో గౌతమ్ గంభీర్ వచ్చి తమ ప్లేయర్ ని తీసుకుని వెళ్లారు,వెంటనే కోహ్లీ గంబీర్ తో వాగ్వాదానికి దిగారు,ఒక పక్క మాట్లాడుతూ ఉంటె ఎలా తీసుకుని వెళ్తావు అని గొడవ వేసుకున్నారు.K L రాహుల్ ,అమిత్ మిశ్ర వచ్చి కోహ్లీ ,గంబీర్ ని పక్కకి తీసుకుని పోయి గొడవ ని ఆపారు.స్టేడియం లో అంత మంది చూస్తుండగా ఇద్దరు సీనియర్ ప్లేయర్ లు ఇలా గొడవ వేసుకోవడం మీద బీసీసీఐ చాల సీరియస్ అయింది.

వరల్డ్ కప్ విన్నెర్స్ అయినా కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవలో వీరి ఇద్దరి తో పాటు గొడవ కి కారణం అయినా బౌలర్ కి బీసీసీఐ ఫైన్ విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.21 కింద లెవెల్ 2 నిబంధనను ఉల్లంఘించినట్లు గంభీర్ ఒప్పుకున్నాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. విరాట్ కోహ్లీ కూడా తప్పిదం చేసినట్లు అంగీకరించాడంతో అతని మ్యాచ్ ఫీజులో కూడా 100 శాతం ఫైన్ విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది. అఫ్ఘాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేసింది. బీసీసీఐ విధించిన జరిమానా ప్రకారం కోహ్లీ రూ.1.07 కోట్లు ఫైన్ కట్టనున్నాడు. గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ రూ.1.79 లక్షల ఫైన్ విధించారు.

681 views