IPL2023:ధోని మీద మండిపడుతున్న క్రికెట్ ఫాన్స్ ! కెప్టెన్ కూల్ కావాలనే ఇలా చేస్తున్నారా ?

Posted by venditeravaartha, April 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

భారత దేశం లో రెండే అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ లు అందులో మొదటిది సినిమా అయితే ,రెండోది క్రికెట్.మన ఇండియా లో ఉన్న క్రికెట్ లో సచిన్ తర్వాత ఆ స్థాయి అభిమానం,క్రేజ్ కలిగి ఉన్న క్రికెటర్ ‘మహేంద్ర సింగ్ ధోని’.2004 లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ధోని,చాల తక్కువ కాలం లోనే ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా నియమితులయ్యారు.2007 T20,వరల్డ్ కప్,2011 ODI వరల్డ్ కప్,2013 ఛాంపియన్స్ ట్రోఫీ ని ఇండియా కి అందించిన ధోని IPL లో చెన్నై సూపర్ కింగ్స్ కి 4 ట్రోఫీ లు అందించారు.

2019 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరం అయినా ధోని ,ఇంటర్నేషనల్ క్రికెట్ కి రెటైర్డ్మెంట్ ప్రకటించిన అనంతరం,IPL లో 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ కి ట్రోఫీ ని తీసుకుని వచ్చారు,అయితే ప్రస్తుతం జరుగుతున్న IPL తనకి చివరిది అని పరోక్షంగా చెప్తూ వస్తున్న ధోని,మొదట ఆడిన మ్యాచ్ ల లో చివర్లో దిగి సిక్సర్ లు బాదారు ,అయితే ఈ మధ్య జరిగిన రెండు ,మూడు మ్యాచ్ ల లో అసలు బ్యాటింగ్ కి రావడం లేదు.ఈ విషయం మీద అభిమానులు ధోని మీద తీవ్ర అసంతృప్తి ని వ్యక్తపరుస్తున్నారు.

IPL 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఎక్కడ జరిగిన కూడా అభిమానులు ధోని కోసం ,తన బ్యాటింగ్ చూడటం కోసం స్టేడియం అంత నిడిపోతున్నారు,ప్రత్యర్థి టీం వాళ్ళు కూడా ధోని ధోని అని అంటున్నారు అంటే అయన కోసం ఎంత వెయిటింగ్ చేస్తున్నారో తెలుస్తుంది,ఇంత తెలుస్తున్నా కూడా ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రావడం లేదు,నిన్న జరిగిన రాజస్థాన్ మ్యాచ్ లో 14 .5 ఓవర్ల లో 124 / 5 దగ్గర అందరు ధోని బ్యాటింగ్ కి వస్తారు అనుకున్నారు కానీ ఆ ప్లేస్ లో జడేజా వచ్చాడు.

చెన్నై గెలుపు కోసం 31 బంతుల లో 79 పరుగులు కావాల్సిన తరుణం లో అందరు ధోని వచ్చి మ్యాచ్ గెలిపిస్తారు అనుకున్నారు,కానీ జడేజా ,దుబే 31 బాల్స్ ఆడి 46 పరుగులు మాత్రమే చేయడం తో చెన్నై ఓడిపోయింది.ఇక రానున్న మ్యాచ్ ల లో అయినా ధోని 4 ,5 ప్లేస్ ల లో బ్యాటింగ్ రావాలి అని అందరు కోరుకుంటున్నారు.మరి తన చివరి IPL ఆడుతున్న ధోని తన అభిమానుల కోరిక మేరకు ముందుగా బ్యాటింగ్ రావాలి అని అలానే చెన్నై సూపర్ కింగ్స్ కి మరో ట్రోఫీ ని అందించాలి అని కోరుకుందాం.

582 views