Seema Raja: కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టుగా, ఈ సార్వత్రిక ఎన్నికలతో వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కారణాలలో ఒకరు సీమ రాజా. వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ, వైసీపీ పై వ్యంగ్యంగా ఈయన చేసిన వీడియోలు యూట్యూబ్ లో ఒక రేంజ్ లో పేలాయి. ఎక్కడ చూసినా ఈ సీమరాజానే ట్రెండ్ అవుతూ ఉండేవాడు. అతని బాషా, యాస కి కనెక్ట్ అవ్వని వారంటూ ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇతని వీడియోలు చూస్తే వైసీపీ పార్టీ కి ఓటు వెయ్యాలని అనుకున్నవారు కూడా, ఓటు వెయ్యరు అని చెప్పొచ్చు.
ఆ స్థాయిలో సోషల్ మీడియా లో ద్వారా ఈయన వైసీపీ పార్టీ కి డ్యామేజ్ చేసాడు. అసలు ఇంతకీ ఎవరు ఈ సీమరాజా?, వైసీపీ పార్టీ పై ఇతనికి ఇంత పగ ఎందుకు ఏర్పడింది? అనేది ఇప్పుడు ఈ కథనం లో తెలుసుకుందాం. సీమరాజ విదేశాల్లో మంచి చదువులు చదివి ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి. అదే విధంగా యూట్యూబ్ లో ఒక సీమ మీడియా అనే ఛానల్ ని స్థాపించి, ఆ ఛానల్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే సంఘటనల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. అలా ఆయన పలు వీడియోలలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధివిధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వీడియోలు చేసాడు.
దీని వల్ల వైసీపీ పార్టీ నుండి సీమరాజ కి బెదిరింపులు రావడం మొదలయ్యాయి. కేవలం బెదిరింపులతో వారు ఆగిపోలేదు. సీమరాజ చేసుకుంటున్న వ్యాపారాలను కూడా తీవ్రంగా దెబ్బ తీసాడు. ఆ విధంగా ఆర్థికంగా బాగా నష్టపోయిన సీమరాజ కొన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని నడపలేకపోయాడు. మళ్ళీ తన వ్యాపారాలను మెరుగుపర్చుకొని ఈసారి వైసీపీ కండువా మెడలో వేసుకొని తన సీమ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సీమ రాజా మీడియా గా మార్చుకొని వీడియోలు చెయ్యడం మొదలెట్టాడు. అప్పటి నుండి ఆయన ఛానల్ రేంజ్ మారిపోయింది. లక్షల్లో, మిలియన్స్ లో వ్యూస్ రావడం తో ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వైసీపీ పతనం కి ఒక పావుగా మారిపోయింది. ఈరోజు సీమరాజ అంటే తెలియని వారంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.