కమలాసన్ దగ్గర శోభన్ బాబు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు?

Posted by venditeravaartha, June 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీలో కొన్ని బయటప ప్రపంచానికి తెలియకుండా కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అవి చాలా కాలం తరువాత బయటకు రావడంతో ఆశ్చర్యమేస్తుంది. అలనాడు ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ చెప్పిందే వేదం. అతను కొన్ని స్క్రిప్టు, సీన్స్ అనుకున్నారంటే వాటిని అస్సలు మార్చేవారు కాదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం డైరెక్టర్ చెప్పినట్లు చేసేవారు. అలా చేయబట్టే సినిమాలు అద్భుతంగా వచ్చాయి. అయితే అప్పుడున్న హీరోల్లో శోభన్ బాబు ( Sobhan Babu )ది ప్రత్యేకం. అల్ ఇండియా అందగాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు స్టార్ అయిన తరువాత నచ్చని సీన్లను అస్సలు చేసేవాడు కాదట. అలా ఓసారి ప్రవర్తించడంతో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా ఏదో చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదటితరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో సమానంగా శోభన్ బాబు గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే శోభన్ బాబు కొంచెం పట్టుదలతో ఉండేవారు. సినిమాల విషయంలో నచ్చని సీన్లను అస్సలు ఒప్పుకునేవారు కాదు. అంతేకాకుండా తాను చేసే క్యారెక్టర్ కాస్త నామోషీగా ఉంటే చేసేవాడు కాదు. అందుకే శోభన్ బాబు చివరి వరకు హీరోగానే నటించి సినిమాల నుంచి తప్పుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయమని ఎంతోమంది ప్రాథేయపడినా చేయనని తెగేసి చెప్పేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్ ఓ సినిమా కోసం శోభన్ బాబును సంప్రదించాడు. ప్రయోగాత్మక చిత్రాలు తీసే బాలచందర్ మదిలో నుంచి వచ్చింది ‘ఆకలి రాజ్యం’. ఇందులో కమలాసన్ ( Kamal Haasan )హీరో.

ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ముందుగా ఈ కథను బాలచందర్ గారు శోభన్ బాబుకు వివరించారు. ఈ సినిమా కోసం రెండు, మూడు సార్లు సిట్టింగులు కూడా చేశారు. చివరికి ఓ సీన్ విషయంలో శోభన్ బాబు ఒప్పుకోలేదు. ఈ సినిమాలో బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి తిండి తిప్పలు లేకుండా జీవిస్తాడు. చివరికి బతుకు దెరువు కోసం హెయిర్ సెలూన్ లో పనిచేస్తాడు. అయితే శోభన్ బాబు ఆ సీన్ చేయడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఆ సీన్ ను మార్చమని బాలచందర్ కు సలహా ఇచ్చాడు. కానీ బాలచందర్ అస్సలు ఒప్పుకోలేదు. ఈ సీన్ కచ్చితంగా ఉండాల్సిందేనని అన్నారు. చివరికి ఆయన సీన్ కాదు కదా.. ఏకంగా హీరోనే తప్పించి కమలాసన్ ను చేర్చాడు. ఆ తరువాత ఆకలిరాజ్యం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అయితే సినిమా వంద రోజుల ఫంక్షన్ కు హీరో కమలాసన్ తోటి హీరో శోభన్ బాబు వద్దకు వెళ్లి ఆహ్వానించాడట. దీంతో శోభన్ బాబు తాను చేయాల్సిన సినిమా ఇంత హిట్టు కొడుతుందని నుకోలేదని కన్నీళ్లు పెట్టాడట.

Interesting-Incident-Between-Sobhan-Babu-And-Kamal-Haasan

Tags :
1412 views