Indraja: నిజంగా నా జన్మ ధన్యమైంది అంటూ ఎమోషనల్ అయిన ఇంద్రజ

Posted by venditeravaartha, February 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇంద్రజ అసలు పేరు రజిత తాను హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా జంతర్ మంతర్ లో తన పాత్ర పేరు ఇంద్రజ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే ఒక ఇంటర్వ్యూ జరిగింది అప్పటినుండి తన పేరు ఇంద్రజ గా రాయడం మొదలైంది. మొదటి అవకాశం వచ్చింది జంతర్ మంతర్ లో అయినప్పటికీ మొదటగా రిలీజ్ అయిన చిత్రం మాత్రం యమలీల ఈ చిత్రంలో ఆలీ హీరో గా నటించారు ఈయనకు జంటగా ఇంద్రజ నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయి వరుసగా టాప్ హీరోస్ అందరితోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుంది తాను హీరోయిన్ గా 30కి పైగా సినిమాలు నటించింది కానీ వాటిలో ఎక్కువగా జంట హీరోయిన్స్ ఉన్న సినిమాలే ఉన్నాయి ఇంద్రజకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా నేటికీ బెస్ట్ మూవీ గా ఉన్న సినిమా సొగసు చూడతరమా ఈ సినిమాకి బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

ఇంద్రజ గారు ప్రేమ వివాహం చేసుకున్నారు వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యారు తిరిగి 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు బుల్లితెరపై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో తల్లి, అక్క, ఇంకా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇంద్రజ గారు జడ్జిగా ఉన్నప్పటి నుండి తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తన డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు, నవ్వు చూస్తుంటే నిజంగా ఆ ఇంద్రజ భూలోకానికి తిరిగి వచ్చినట్లుగా తెలుగింటి మహాలక్ష్మి లా కనిపిస్తారు అని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇంద్రజ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు తాను చేసే షోస్ గురించి తన గురించి అప్డేట్స్ ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటారు రీసెంట్ గా ఒక వీడియో షేర్ చేశారు ఇంస్టాగ్రామ్ లో తాను ఎంతో భక్తితో కొలిచే పుట్టపర్తి సాయిబాబా తాను నవ్వుతుంటే తన వైపు చూస్తున్నట్లు గా ఉన్న వీడియోను చూసి ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. నాకు ఇది ఎంతో స్పెషల్ వీడియో అందుకే మీ అందరితో పంచుకోవాలి అనిపించింది అని పోస్ట్ పెట్టారు.

Tags :
1541 views