ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆచార్య లో తన తండ్రి చిరంజీవి గారితో నటించి భారీ డిజాస్టర్ ని అందుకున్నపటికి ఆయన రేంజ్ ఇంచ్ కూడా తగ్గలేదు దానికి తోడు బ్లాక్ బస్టర్ లైన్ అప్ తో తన తదుపరి సినిమా ల ను రెడీ చేసాడు స్టార్ డైరెక్టర్ శంకర్ గారితో తన 15 వ సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న రామ్ చరణ్(Ram charan) ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు.ఒక పక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50 వ సినిమా కావడం తో బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఇప్పటికే భారీగా ఖర్చు చేస్తున్నారు. శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్ కావడం తో సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్(Game changer) సినిమా కోసం దిల్ రాజు గారు మొదట గా 200 కొట్ల మేర అనుకుని షూటింగ్ స్టార్ట్ చేసారు.అయితే శంకర్(Shankar) గారు తన సినిమా ల లో వేసే సెట్టింగ్స్ ,సాంగ్స్ ల కోసమే కొట్ల లను ఖర్చు చేస్తారు.మొదటగా ఈ సినిమా ని ఈ సంవత్సరం దసరా కి రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసారు ,కానీ శంకర్ ఈ సినిమా తో పాటు గా కమల్ హాసన్ గారి ఇండియన్ 2 కూడా డైరెక్ట్ చేస్తుండటం తో ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక మేకర్స్ గేమ్ ఛేంజర్ ని అక్టోబర్ కి షూటింగ్ పూర్తి చేసి సినిమా ని సంక్రాంతి కి తీసుకుని రావాలి అని ప్లాన్ చేసారు.
ఈ మధ్య లో రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో మాల్దీవ్స్ ట్రిప్ వెళ్లడం అదే సమయం లో శంకర్ గారు ఇండియన్ 2 లో బిజీ ఉండటం తో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.మరల షూటింగ్ స్టార్ట్ అయింది అనుకునే సమయం లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్ ల కోసం మరో 25 కొట్ల బడ్జెట్ ని పెంచనున్నారు అని సమాచారం.ఇప్పటికే అనుకున్న 200 కోట్లా బడ్జెట్ కి పాతిక కోట్లు పెంచిన శంకర్ ఇప్పుడు మరొక సారి ఇంకో 25 కోట్లు పెంచడం తో సినిమా బడ్జెట్ 225 కోట్లు దాటేసింది.సినిమా షూటింగ్ ఇంకా 50 శాతం ఉండటం తో శంకర్ ఇంకా ఎంత బడ్జెట్ పెంచుతాడో ఏమో అని దిల్ రాజు(Dil raju) కి టెన్షన్ పడుతున్నారు అంట.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈజీ గా 1000 కొట్ల మార్క్ ని దాటేస్తుంది అని ఆశిస్తున్నారు.