NTR: చిరంజీవి గారి సినిమా ల లో ఆ సినిమా అంటే నాకు ప్రాణం :జూనియర్ ఎన్టీఆర్

Posted by venditeravaartha, June 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారు అంటే ఇష్టం లేని వారు అంటూ ఎవరు ఉండరు ఇండస్ట్రీ లో అలా చెప్పుకుంటే నందమూరి ఫ్యామిలీ తో సినిమా ల లో పోటీ ఉన్నపటికీ వ్యక్తిగతమగా స్నేహం తో ఉంటారు.అప్పట్లో చిరంజీవి గారు ,సీనియర్ ఎన్టీఆర్ గారి తో స్నేహం తో ఉండగా ఆ తర్వాత బాలకృష్ణ గారితో కూడా చాల స్నేహ భావంతో ఉంటారు.ఇక ఇండస్ట్రీ లో ఉన్న పోటీ తో వీరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికి అవి సినిమా ల వరకే ఉండటం వీరి మధ్య ఉన్న స్నేహం కి నిదర్శనంగా కనిపిస్తుంది.ఇక చిరంజీవి ,బాలకృష్ణ తర్వాత వీరి ఫ్యామిలీ ల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లు కూడా సోదర భావం తో కలిసి ఉంటారు.ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో వీరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది.

chiru and ntr

జూనియర్ ఎన్టీఆర్(NTR) తన కెరీర్ ప్రారంభం లో ఆది,సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రావడం తో మెగాస్టార్ తో పోటీ కి రెడీ అన్నట్లు కొన్ని మీడియా ల లో ప్రచురించారు.కానీ వాస్తవానికి బాలకృష్ణ ని ఎలా అయితే చూస్తారో అంతకు మించి చిరంజీవి గారి మీద గౌరవం ఉంది అని చాల సార్లు చెప్పారు ఎన్టీఆర్.ఇక తన చిన్న తనం లో బాలయ్య బాబు గారి మూవీస్ ఎలా అయితే చూశానో అలానే చిరంజీవి గారి మూవీస్ కూడా చూసే వాడిని..నేను చుసిన చిరంజీవి గారి మూవీస్ ల లో రుద్ర వీణ(Rudraveena) అంటే నాకు చాల ఇష్టం.

rudraveena

అప్పటికే మాస్ హీరో గా సూపర్ స్టార్ డాం తో ఉన్న మెగా స్టార్ చిరంజీవి గారు అలాంటి ఒక క్లాసిక్ సినిమా ని ఒప్పుకోవడం ఏ చాల గొప్ప విషయం.అందులో ఆయన నటన అంటే నాకు చాల ఇష్టం.సినిమా లోని ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లా ఉంటుంది.నేను చాల సంవత్సరాల నుంచి అలాంటి ఒక సినిమా చేయాలి అనుకుంటున్న కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా ల లైన్ అప్ కి అలాంటి సినిమా కి అసలు పొంతన ఉండదు.కానీ ఖచ్చితంగా అయితే అటువంటి సినిమా చేస్తాను అని అన్నారు.

3057 views