SALAAR: సాలార్ కి కెజిఫ్ కి ఉన్న సంబంధం తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Posted by venditeravaartha, July 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బాలీవుడ్ ,టాలీవుడ్ ,కోలీవుడ్ ల ని అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ లు గా చూస్తారు దానికి కారణం ఈ ఇండస్ట్రీ ల నుంచి వచ్చే మూవీస్ మరియు రెమ్యూనిరేషన్ ల ను బట్టి డిక్లేర్ చేసే వారు కానీ ప్రశాంత్ నీల్ ,యాష్ కలయిక లో వచ్చిన కెజిఫ్ సినిమా తరువాత ఈ ఇండస్ట్రీ ,ఆ ఇండస్ట్రీ అనేది లేకుండా ఇండియన్ సినిమా అనే స్థాయి కి ఎదిగింది కన్నడ సినిమా.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ,రవిబాసురు మ్యూజిక్ కి యాష్ అద్బుతమైన నటన తోడు అవడం తో గత ఏడాది రిలీజ్ అయినా కెజిఫ్ చాప్టర్ 2(KGF2) ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా ప్రెస్టీజియస్ 1000 కోట్ల క్లబ్ చేరింది.

kgf2

హోంబేలె ఫిలిమ్స్ నిర్మించిన కెజిఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయి పెరిగింది అనే చెప్పాలి
ఇక ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరో గా రానున్న సాలార్(SALAAR) మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.బాహుబలి తర్వాత సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కి సాలార్ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుంది అని అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జులై 6 న రిలీజ్ కానున్న సాలార్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానుల తో పాటు గా యావత్ ఇండియన్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు

salaar

ఇక మొదటగా రిలీజ్ అయినా ప్రభాస్ లుక్ ని చూసిన ఫ్యాన్స్ ఇది ఖచ్చితంగా కెజిఫ్ మూవీ కి సీక్వెల్ అయి ఉంటుంది అని అభిప్రాయపడ్డారు.కెజిఫ్ పార్ట్ 2 లో విల్లన్ సంజయ్ దత్ ని ఎదుర్కొని చనిపోయినట్లు చూపించిన అతనే సాలార్ లో హీరో అని ఆయనే ప్రభాస్ అంటూ వార్తలు వచ్చాయి.దానికి ఆ పిల్ల వాడి మెడ లో ఉన్న దండ సాలార్ పోస్టర్ లో ప్రభాస్ మెడ లో ఉన్న దండ కి మ్యాచ్ అయింది అంటూ అప్పట్లో పెద్ద పుకార్లే వచ్చాయి.అయితే అని అన్ని కూడా కేవలం పుకార్లే అని సినిమా యూనిట్ తెలియాచేసారు.సాలార్ అనేది కొత్త కథ అని
కెజిఫ్ కి సాలార్ కి సంబంధం లేదు అని కొన్ని ఇంటర్వ్యూ ల లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏ స్వయంగా చెప్పారు.

salaar poster

కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన సాలార్ టీజర్ పోస్టర్ లో ప్రభాస్ మాస్ లుక్ ,తనకి ఎదురుగా ఉన్న కెజిఫ్ స్టైల్ విల్లన్స్ మరియు కెజిఫ్ 2 లో రాకీ చనిపోయే ముందు మనకి కనిపించే గడియారం టైం దానికి తోడు షిప్ లో ప్రభాస్ ఉన్నట్లు కనిపించిన కొన్ని లీకెడ్ పిక్స్ ని చూసిన ఫ్యాన్స్ ఇది ఖచ్చితంగా కెజిఫ్ కి కొనసాగింపు అని భావిస్తున్నారు.కెజిఫ్ మూవీ పూర్తి అయినా తర్వాత ప్రశాంత్ నీల్ సాలార్ కథ రాసుకున్నారు అంటే కెజిఫ్ ఎక్కడ అయితే ఆగిందో అక్కడి నుంచే సాలార్ కథ మొదలు అవుతుంది అని చెప్పకనే చెప్తున్నారు.రాకీ కెజిఫ్ 2 లో కొంత కాలం అమెరికా ,మరి కొన్ని దేశాల లో తన బిజినెస్ ల ను చేస్తారు అని చెప్పారు ఆ టైం లో తనకి ఎంతో నమ్మకంగా ఉన్న స్నేహితుడు రాకీ చనిపోయిన తర్వాత ఇండియా కి వచ్చి రాకీ ప్లేస్ లో ఉంటారు అని కూడా సమాచారం ఉంది.ఆ స్నేహితుడే మోస్ట్ డెంజర్స్ పర్సన్ ఇన్ ది వరల్డ్ సాలార్(ప్రభాస్) గా చూపించబోతున్నారు.

yash vs prabhas

2006 views