Project K: ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవుతారు :నాగ్ అశ్విన్

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కమల్ హాసన్ అనే పేరు ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పాటు యావత్ ప్రపంచం అంతటా వినపడుతోంది.చిన్నతనం నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈయన తన గురువు ,ఫిలాసఫర్ మరియు తండ్రి లా భావించే లెజెండరీ డైరెక్టర్ అయినా కె.బాలచందర్ గారి డైరెక్షన్ ఎన్నో సూపర్ హిట్ సినిమా ల లో నటించి తమిళ్ తో పాటు తెలుగు మరియు ఇతర భాష ల లో గుర్తింపు తెచ్చుకున్నారు.గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నా కమల్ హాసన్ గారికి ‘విక్రమ్’ మూవీ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ లభించింది.ఇక విక్రమ్ ఇచ్చిన ఉత్సాహం తో ఇండియన్ 2 లో ప్రస్తుతం నటిస్తున్న కమల్ హాసన్(Kamal hasan) ఇండియన్ మోస్ట్ వైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె లో చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

kamal hasan

ప్రభాస్(Prabhas),దీపికా పదుకునే,అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ లు చేస్తున్నా ప్రాజెక్ట్ కె(project k)  లో ఇటీవలే కమల్ హాసన్ గారు కూడా జాయిన్ అయ్యారు.హై బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.రెమ్యూనిరేషన్ లు కాకుండా 400 కోట్ల పైన నిర్మాణ ఖర్చు తో ఈ సినిమా ని తీస్తున్నారు.ఇక టోటల్ గా అయితే దాదాపు 600 కోట్ల పైన ఖర్చు చేసారు అనేది సమాచారం సైన్స్ అండ్ ఫిక్షన్ కలిపి చేస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ మోడరన్ కృష్ణ గా కనిపిస్తారు అని టాక్ ఉంది.ప్రభాస్ కి పోటీగా విలన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారు చేస్తున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది.

project k

ప్రాజెక్ట్ కె సినిమా కి సంబంధించిన టైటిల్ మరియు షూటింగ్ కి రిలేటెడ్ మొదలైన కొన్ని విషయాలను జులై 20 న రిలీజ్ చేయనున్న సందర్భం లో సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)) గారు సినిమా లో కమల్ హాసన్ గారి పాత్రా మీద వస్తున్నా ప్రచారాల మీద క్లారిటీ ఇచ్చారు.ప్రభాస్, అమితాబచ్చన్ మాదిరిగానే కమల్ హాసన్ గారిది కూడా సినిమా లో చాల కీలకమైన రోల్ అని  సోషల్ మీడియా లో వస్తున్నట్లు గా ఆయన ఈ సినిమా లో విలన్ కాదు అని ,అయన క్యారెక్టర్ తో సినిమా ఒక రేంజ్ కి వెల్తుంది అని పక్కగా చెప్తున్నం అంటూ తెలియచేసారు.

2029 views