Actress: హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ ఆ ??

Posted by venditeravaartha, July 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ముఖ్యంగా కావలసింది కథ.అయితే కొన్ని సినిమా ల కి కథ సరిగా లేకపోయినా అందులో నటించిన హీరో ,హీరోయిన్ ల పెర్ఫార్మన్స్ ని బట్టి హిట్ అయినా సినిమా లు కూడా ఉన్నాయి.ప్రతి సినిమా లో హీరో ,హీరోయిన్ అంటే వాళ్ళ క్యారెక్టర్ ని చాల పాజిటివ్ గా డిజైన్ చేస్తారు డైరెక్టర్ లు ,విలన్ అంటే నెగటివ్ హీరో అంటే పాజిటివ్ ఇక హీరోయిన్ అంటే అమాయకురాలు అందమైన అమ్మాయిగా చూపించిన చాల సినిమా లను చూసాము కానీ మారుతున్న ట్రెండ్ కి అనుగునంగా కథ ల ను కూడా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

kumar21f

2015 లో సుకుమార్ తన రైటియింగ్స్ నుంచి తానే ప్రొడ్యూసర్ గా మారి అతని అసిస్టెంట్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన కుమారి 21f మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి రాజ్ తరుణ్ కి తన కెరీర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా గా రికార్డు సృష్హించింది.ఇందులో హెబ్బా పటేల్ తన అందం తో పాటు నటన తో ఆకట్టుకున్నారు.ఇందులో రాజు తరుణ్ స్వచ్ఛమైన ప్రేమ ని ఆశించిన లవర్ గా చేయగా హెబ్బా పటేల్ ఒక వైపు ట్రూ లవర్ గా మరో వైపు నెగటివ్ సైడ్ లో నటించి సినిమా విజయం లో ప్రధాన పాత్రా పోషించారు.

rx100

ఇక 2018 లో రిలీజ్ అయినా కార్తికేయ గారి RX100 మూవీ అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అయినా దానికి ఏ మాత్రం మించిపోకుండా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..సినిమా మొదట్లో హీరోయిన్ ని మంచిగానే చూపించిన చివర్లో ఆమెలో ఉన్న బ్యాడ్ ని చూపించి క్లైమాక్స్ తో అందర్నీ ఏడిపించి బ్లాక్ బస్టర్ ని కొట్టారు డైరెక్టర్.అయితే RX100 సినిమా మాదిరిగానే ఇటీవల రిలీజ్ అయినా బేబీ సినిమా లో కూడా వైష్ణవి క్యారెక్టర్ ని ఒక వైపు స్వచ్ఛమైన ప్రేమ మరొక వైపు ప్రేమించిన వారిని మోసం చేసే క్యారెక్టర్ లో చూపించి క్లైమాక్స్ ని విషాదం తో ముగించి బ్లాక్ బస్టర్ ని సాధించారు.

baby

పైన చెప్పిన సినిమా ల లో హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అవడం వలన ఆ సినిమా లు బ్లాక్ బస్టర్ లు కాలేదు అందులో కంటెంట్ ఉండటం ప్రస్తుతం జరుగుతున్న వాటికీ రిలేటెడ్ గా ఉండటం తో వాటిని ప్రేక్షకులు ఆదరించారు అని మాత్రమే అనుకోవాలి.

1757 views