Anasuya-Devarakonda: అనసూయ తో నాకు ఏమి గొడవ లేదు:ఆనంద్ దేవరకొండ.

Posted by venditeravaartha, July 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో బ్రదర్ హుడ్ అనేది మొదటి నుంచి ఉంది అయితే అందుకో ఒకరు సక్సెస్ అయితే మరొకరు ఫెయిల్ ఆయినా సందర్భాలు చాల ఉన్నాయి.అలా కాకుండా అన్న దమ్ములు ఇద్దరు సక్సెస్ అయినా వారు చాల తక్కువ ఉన్నారు అందులో చిరంజీవి ,పవన్ కళ్యాణ్ మన తెలుగు నుంచి ఉంటె తమిళ్ లో సూర్య ,కార్తీ సక్సెస్ అయ్యారు.వీరిలానే మన తెలుగు లో దేవరకొండ బ్రదర్స్ సక్సెస్ అయ్యారు.పెళ్లి చూపులు సినిమా తో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి ,గీత గోవిందం ,టాక్సీవాలా ల తో స్టార్ హీరో గా ఎదిగారు.విజయ్ దేవరకొండ గారి తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ దొరసాని ,మిడిల్ క్లాస్ మెలోడీస్ ,పుష్పక విమానం,బేబీ మూవీ ల తో మంచి సక్సెస్ సాధించారు.

vijay brothers

అయితే ఒకరు ఇండస్ట్రీ లో ఎదుగుతున్నారు అంటే ఇండస్ట్రీ నుంచి ,బయట నుంచి కొంత మంది వ్యక్తులు కిందకి లాగాలని చూస్తూ ఉంటారు.దానికి తోడు అతి తక్కువ సమయం లో టాప్ కి ఎదుగుతున్న వారికీ మరికొన్ని అడ్డంకులు వస్తాయి.అర్జున్ రెడ్డి సినిమా సమయం లో విజయ్ దేవరకొండ కి ఇండస్ట్రీ నుంచి కొన్ని నెగటివ్ కామెంట్ లు వచ్చాయి.మరి ముఖ్యంగా యాంకర్ ,నటి అయినా అనసూయ అప్పట్లో విజయ్ మీద చేసిన వ్యాఖ్యలు మీడియా ల లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఆ టైం లో విజయ్ ఫ్యాన్స్ తనని ఆంటీ అని సోషల్ మీడియా ల లో స్ప్రెడ్ చేయడం తో అనసూయ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

anasuya

విజయ్ దేవరకొండ ఖుషి మూవీ ఫస్ట్ లుక్ లో ది విజయ్ దేవరకొండ అని ఉండటం తో చాల మంది విజయ్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసారు.పెద్ద పెద్ద స్టార్ హీరో లు ,లెజెండరీ పర్సనాలిటీ ఉన్న వారే ‘ది’ అని పెట్టుకోరు కొంత మందికి పైత్యం ఎక్కువ అవడం వలన ‘ది’
అని ఓవర్ చేస్తున్నారు అంటూ అనసూయ పోస్ట్ చేసారు.దీనికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్
తనని విపరీతముగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ ని బేబీ టీం ని విష్ చేస్తూ అనసూయ ఒక పోస్ట్ పెట్టింది.అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ ,ఇక ఇదే విషయాన్ని ఆనంద్ ని అడిగితే తనకి ,అనసూయ కి ఏమి గొడవలు లేవు అని.నేను ఇండస్ట్రీ లో ఉన్నావు అందరిని కలుపుకుని పాజిటివ్ గా వెళ్ళాలి.విజయ్ కి అనసూయ కి కూడా ఏమి గొడవలు లేవు,అవి కేవలం సోషల్ మీడియా లో వచ్చిన కొన్ని వాటికీ రెస్పాండ్ కావాల్సిన పని లేదు అంటూ ఆనంద్ దేవరకొండ ఒక క్లారిటీ ఇచ్చాడు.

1472 views