మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్(Ram charan) మొదటి సినిమా చిరుత(chirutha) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక తన రెండవ సినిమా మగధీర తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.రెండవ సినిమా తోనే తండ్రి ని మించిన తనయుడు అనేలా చేసాడు చిరంజీవి గారు రాజకీయాల లో కి వెళ్లిన సమయం లో మెగా ఫ్యామిలీ లెగసీ ని తన బుజాల మీద వేసుకున్నాడు రామ్ చరణ్.ఒక పక్క సినిమా ల లో నటిస్తూ మరో పక్క తన తండ్రి,బాబాయ్ ల దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారం తో ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉన్నారు.తన ని ఎవరు అయితే నటన రాదు ,ఎక్స్ప్రెషన్ రాదు అని ట్రోల్ల్స్ చేసారో వారి చేత ప్రశంసలు అందుకునే స్థాయి కి ఎదిగాడు రామ్ చరణ్.
ధ్రువ ,రంగస్థలం సినిమా ల లో తన నటన కి అందరి దగ్గర నుంచి అభిందనలు పొందిన రామ్ చరణ్,గత ఏడాది రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని తన నటన తో యావత్ ప్రపంచం అంతటా తన మీరు మారుమ్రోగేలా చేసాడు.సినిమా లో ఇద్దరు స్టార్ హీరో లు ఉన్న కూడా రామ్ చరణ్ కె ఎక్కువ క్రెడిట్ లభించింది.ఆర్ ఆర్ ఆర్(RRR) మూవీ సాధించిన ఇంటర్నేషనల్,గ్లోబల్ అవార్డ్స్ ల లో రామ్ చరణ్ ఎక్కువ ఫోకస్ అయ్యాడు అనడం లో సందేహమే లేదు.ఇక ఎంతో ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డు గెలుపొందిన తర్వాత తన రేంజ్ హాలీవుడ్ స్థాయి కి ఎదిగింది.మెగా పవర్ స్టార్ కాస్తా గ్లోబల్ స్టార్ గా మారాడు.
ప్రస్తుతం ఇండియా లో ఉన్న లో ఉన్న టాప్ స్టార్స్ అయినా అమితాబ్ , షారుక్ ఖాన్ ,సల్మాన్
అమీర్ ఖాన్ ,రజినీకాంత్ ,కమల్ హాసన్ ,చిరంజీవి ల కి అందని గౌరవం రామ్ చరణ్ కి దక్కింది,కాశ్మీర్ వేదికగా జరుగుతున్న G20 సదస్సు కి ఇండియన్ సినిమా తరుపున రామ్ చరణ్ వెళ్లారు. కాశ్మీర్ లో టూరిజం కోసం ఇండియన్ సినిమా ఏమైనా చేస్తుంది అంటూ రామ్ చరణ్ తెలియపరిచారు.మన సినిమాల ద్వారా పాతుకుపోయిన సంస్కృతి & ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడిని. అత్యంత సాపేక్ష కంటెంట్ ద్వారా విలువైన జీవిత పాఠాలను అందించగల సామర్థ్యంలో భారతీయ సినిమా ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంది అంటూ రామ్ చరణ్ తన మనసులోని భావాలను ట్విట్ ద్వారా పంచుకున్నాడు.