Hyper Aadi : హైపర్ ఆది గురించి పరిచయం అవసరం లేదు.ఈటీవీలో జబర్దస్త్ షో నుండి ప్రస్తుతం కమీడియన్ స్థాయికి ఎదిగారు. తన పంచ్ డైలాగ్స్ తో ఒక ప్రత్యేక స్థానాన్ని కమీడియన్ గా ఏర్పరచుకున్నారు ఆది. తెలుగులో ఆది చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించారు. హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చేస్తూ అలరిస్తున్నారు. జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ద్వారా కూడా ఆది తన పంచులతో ఎప్పటికప్పుడు నవ్విస్తూనే ఉన్నారు. ఈటీవీ లోనే కాకుండా కొన్ని అవార్డు ఫంక్షన్ లో కూడా యాంకర్ గా చేస్తున్నారు. ఎన్ని షోలు చేసినా కూడా, పెళ్లి చేసుకోవడానికి కారణం అడిగినప్పుడల్లా ఆది మాట దాటేస్తూ ఉంటారు.
ఈ ఫంక్షన్ లో సింగిల్ గా తను ఉండిపోవడానికి కారణం ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని బహిరంగంగా చెప్పుకొచ్చారు అది ఇప్పుడు ఆ వార్త వైరల్ గా మారింది అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.. గామా తెలుగు సినిమా అవార్డ్స్ నాలుగవ ఎడిషన్ మార్చిలో నిర్వహించారు బ్రెజిల్ పార్క్ లో ఈ వేడుకను ఘనంగా జరిగింది ఈ వేడుకలో ప్రముఖ తారాగణం హాజరై సందడి చేశారు 2021, 2022,2023 సంవత్సరాలకు గాను,వివిధ కేటగిరీలో అవార్డ్స్ ని అందించారు. ఎవరి ఫంక్షన్ యాంకర్ గా సుమా తో పాటు అది కూడా హోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది ఈ ప్రోమోలో హైపర్ ఆది తన సింగిల్ గా ఉండడానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కారణం అని బహిరంగంగా చెప్పాడు ప్రోమో లో మొదట రాహుల్ సిప్లిగంజి దసరా సినిమాలో ఇచ్చి పడేద్దాం పాటతో ఎంట్రీ ఇస్తాడు. తర్వాత చంద్రబోస్ గారికి అవార్డు తీసుకుంటూ తన 11 అవార్డుగా చెప్పుకొస్తారు తర్వాత కల్కి మూవీ గురించి అశ్విని దత్ గారిని సుమా అడుగుతుంది అందుకు ఆయన నవ్వినట్లు మనకు ప్రోమోలో చూపిస్తారు.
మరి నిజంగా కలిగే అప్డేట్ ఇచ్చారా లేదా అన్న తెలియాలంటే మనం మొత్తం ప్రోగ్రాం చూసి తీరాల్సిందే ఇక కొంతమంది సెలబ్రిటీ లకు అవార్ధిస్తున్నట్లు చూపిస్తారు. సినీ ప్రముఖులను మధ్యలో చూపిస్తూ ఉంటారు. దేవిశ్రీప్రసాద్ అవార్డు అందుకోవడానికి వస్తుంటే హైపర్ ఆది ఒక సినిమాలో వన్ సైడ్ లవ్ బెటర్ అని మరొక సినిమాలో లవ్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అది అర్థం కాక నేను సింగిల్ గా ఉండిపోయాను అన్న అని అంటాడు. ఆ మాటకు దేవి శ్రీ ప్రసాద్ నవ్వుతూ నేను కూడా అని అంటాడు. చివరగా ప్రోమోలో ఫరియా అబ్దుల్లాకు అవార్డు ఇచ్చి ముగిస్తారు. ఈ ప్రోమో చూసినవారు కింద కామెంట్స్ లో ఆది పెళ్లి చేసుకోవడానికి కారణం దేవిశ్రీప్రసాద్ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.