Raviteja: రవితేజ – సమంత మధ్య ఇంత కథ నదించిందా..? అందుకే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు!

Posted by venditeravaartha, May 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Raviteja – samantha : టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ తో పాటుగా, టాప్ హీరోయిన్స్ అందరితోనూ కలిసి నటించిన ఘనత మాస్ మహారాజా రవితేజ సొంతం. దర్శకులలో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడు మిగలగా, హీరోయిన్స్ లో సమంత తో ఇప్పటి వరకు రవితేజ కలిసి నటించలేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ సహజంగానే కుదర్లేదు అనుకుంటే పొరపాటే. సమంత అంటే రవితేజ కి అసలు ఇష్టం ఉండదు, అలాగే సమంత కి కూడా రవితేజ అంటే ఇష్టం ఉండదు. అందుకు ఒక ఉదాహరణ ఉంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన చిత్రం ‘బలుపు’. ఈ చిత్రం తోనే గోపీచంద్ మలినేని అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు.

ఆయన ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ కంటే ముందుగా గోపీచంద్ మలినేని సమంత ని సంప్రదించారట. ఇందులో నటించేందుకు సమంత ముందుగా ఒప్పుకుంది. ఇదే విషయాన్నీ రవితేజ కి గోపీచంద్ చెప్తూ ‘మన సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది’ అన్నారట. ఆమె ఈ సినిమాలో నటిస్తే నేను ఈ సినిమా చెయ్యను అని రవితేజ మొహమాటం లేకుండా చెప్పేశాడట. ఈ విషయం సమంత కి తెలిసి బాగా హర్ట్ అయ్యింది. అప్పటి నుండి సమంత కి రవితేజ మీద ద్వేషం ఏర్పడింది. సమంత కి రవితేజ మీద కోపం రావడం లో ఒక కారణం ఉంది.

కానీ రవితేజ ఎందుకు సమంత తో చెయ్యడానికి ఇష్టపడలేదు అనేందుకు మాత్రం కారణం ఎవరికీ తెలియదు. ఇద్దరి మధ్య ఎవరికీ తెలియకుండా కోల్డ్ వార్ నడిచిందా?, లేదా ఏదైనా మనసులో పెట్టుకొని సమంత ని రవితేజ రిజెక్ట్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’ కి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. మిరపకాయ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రవితేజ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవ్వగా దానికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

409 views